News October 9, 2024
హిందూ మెజార్టీ స్థానాల్లో బీజేపీ అనూహ్య ఓటమి

జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూలో తమకు పట్టున్న రెండు స్థానాల్లో BJP ఓటమి పాలైంది. హిందూ ఓటర్లు అధికంగా ఉన్న బానీ, రాంబన్ నియోజకవర్గాల్లో ఓటమి చవి చూసింది. బానీ స్థానంలో BJP అభ్యర్థి జెవాన్‌లాల్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి రామేశ్వర్ సింగ్ ఏకంగా 18,672 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాంబన్‌లో NC అభ్యర్థి అర్జున్ సింగ్ 8,869 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో ఈ రెండు స్థానాల్లో BJP నెగ్గింది.
Similar News
News October 26, 2025
అష్ట ధర్మములు ఏవంటే?

1. యజ్ఞాలు చేయడం, 2. వేదాలు చదవడం,
3. దానాలు చేయడం, 4. తపస్సు చేయడం,
5. సత్యాన్నే పలకడం, 6. సహనం పాటించడం,
7. కష్ట సమయాల్లో నిలకడ, ధైర్యంగా ఉండటం,
8. వివేకం, ముందుచూపుతో వ్యవహరించడం.
ఈ ఎనిమిది ధర్మాలను పాటించడం వలన మనిషి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
<<-se>>#Sankhya<<>>
News October 26, 2025
చనిపోయిన స్నేహితుడిపై ఎర్రిస్వామి ఫిర్యాదు

బైక్ ప్రమాదంలో చనిపోయిన శివశంకర్‌పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి కర్నూలు (D) ఉలిందకొండ PSలో ఫిర్యాదు చేశాడు. ‘నేను, శివశంకర్ మద్యం సేవించాం. అతడి నిర్లక్ష్యం వల్లే ఇద్దరం కిందపడిపోయాం. శివ స్పాట్‌లో చనిపోయాడు. డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించాను. మా <<18102090>>బైకును<<>> మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది. దీంతో బస్సు బైకును లాక్కెళ్లింది’ అని తెలిపాడు. దీంతో శివపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 26, 2025
వంటింటి చిట్కాలు

☛ ఇడ్లీ పిండి పులవకుండా ఉండాలంటే ఆ పిండిపై తమలపాకు ఉంచండి.
☛ క్యాబేజీ ఉడికించేటప్పుడు వచ్చే వాసన కొందరికి నచ్చదు. అప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే ఆ వాసన తగ్గుతుంది.
☛ అల్లం వెల్లుల్లి ముద్ద చేసేటప్పుడు చెంచా వంటనూనె చేర్చితే.. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
☛ కొత్త బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు మట్టివాసన వస్తుంటే నాలుగు పుదీనా ఆకులు వేయండి. వాసన పోయి కూరకు సువాసన వస్తుంది.


