News February 8, 2025

ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకం: చంద్రబాబు

image

AP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం చరిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీపై నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించారని చెప్పారు. ‘ఢిల్లీలో రాజకీయ, వాయుకాలుష్యాన్ని ఆప్ సర్కార్ పట్టించుకోలేదు. చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ సమస్య నుంచి బీజేపీ గట్టెక్కిస్తుందని ప్రజలు నమ్మారు. భారత్‌కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 8, 2025

మెటాలో 3,000 మందికి లేఆఫ్స్?

image

టెక్ దిగ్గజం మెటా భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 10 నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సమాచారం. సుమారు 12 దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. జాబ్ కోల్పోయినవారికి సెవెరెన్స్ ప్యాకేజీ ఇస్తారని టాక్. పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను మాత్రమే తొలగించనున్నట్లు మెటా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

News February 8, 2025

ఢిల్లీలో AAPకు కాంగ్రెస్ దెబ్బ: రాజ్‌దీప్

image

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ AAPకు చాలా డ్యామేజ్ చేసిందని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సాధించిన ఓట్లు బీజేపీ-ఆప్ ఓట్ల మధ్య వ్యత్యాసం కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే చాలా సీట్లలో నెక్ టు నెక్ ఫైట్ ఉండేదన్నారు. 2022లో గోవాలో కాంగ్రెస్ ఇలాగే AAPకు డ్యామేజ్ చేసిందని గుర్తు చేశారు.

News February 8, 2025

ఢిల్లీ ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును అంగీకరిస్తున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీవాసుల హక్కులను రక్షించేందుకు, ఢిల్లీ అభివృద్ధి కోసం, కాలుష్యం, అవినీతి, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని Xలో రాసుకొచ్చారు. ఈ ఎన్నికల్లోనూ ఢిల్లీలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.

error: Content is protected !!