News April 7, 2025
BLACK MONDAY: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్స్

భారత స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 3939 పాయింట్లు నష్టపోయి 71,425, నిఫ్టీ 1,160 పాయింట్లు కోల్పోయి 21,743 వద్ద ప్రారంభమయ్యాయి. బ్యాంకు, ఫార్మా, ఐటీ రంగాల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.19 లక్షల కోట్లు నష్టపోయారు. దీంతో నిపుణులు ఇవాళ బ్లాక్ మండేగా పేర్కొంటున్నారు.
Similar News
News April 10, 2025
ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి టీటీడీ లడ్డూలు

AP: కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ స్వామి కళ్యాణం రేపు సాయంత్రం 6.30 గంటల నుంచి కన్నులపండువగా జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం టీటీడీ 70వేల లడ్డూలను పంపించనుంది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-2లో సేవకులు ఈ లడ్డూల ప్యాకింగ్ పూర్తి చేశారు. రేపు కళ్యాణం అనంతరం భక్తులకు వీటిని పంచిపెట్టనున్నారు.
News April 10, 2025
లండన్‌లో ఆ హీరోహీరోయిన్ల కాంస్య విగ్రహాలు

భారత సినీ చరిత్రలో ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. విడుదలై 30 ఏళ్లు గడచిన సందర్భంగా ఆ మూవీకి లండన్‌లో అరుదైన గౌరవం దక్కనుంది. అక్కడి లైసెస్టర్ స్క్వేర్‌లో DDLJ హీరోహీరోయిన్లు షారుఖ్, కాజోల్ కాంస్య విగ్రహాల్ని నెలకొల్పనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది చివరిలోపు విగ్రహాల్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
News April 10, 2025
అమెరికా వెళ్లే చైనీయులకు బీజింగ్ హెచ్చరికలు

అమెరికాలో ప్రయాణిస్తున్న, ప్రయాణించనున్న తమ దేశస్థులకు చైనా హెచ్చరికల్ని జారీ చేసింది. ‘అమెరికా-చైనా బంధం బలహీనపడటం, అమెరికా దేశీయ భద్రత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని USకి ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలి’ అని స్పష్టం చేసింది. అమెరికా, చైనా ప్రస్తుతం తీవ్రస్థాయి సుంకాల యుద్ధంలో ఉన్న సంగతి తెలిసిందే. చైనాపై మొత్తం సుంకాల్ని ట్రంప్ ఈరోజు 125శాతానికి పెంచారు.