News April 4, 2024
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా టీడీపీపై నిందలా?: వసంత

AP: పెన్షన్ల పంపిణీ వ్యవహారంతో రాజకీయంగా లబ్ధి పొందాలని YCP చూస్తోందని MLA వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. ‘వాలంటీర్లలో YCP వారు ఉన్నారు కాబట్టే పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని EC ఆదేశించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా TDPపై బురద చల్లుతున్నారు. పెన్షన్ల పంపిణీకి డబ్బులు లేక వాయిదా వేశారు. సుమారు లక్షా యాభై వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని తెలిపారు.
Similar News
News January 17, 2026
100 దేశాలకు కార్ల ఎగుమతి.. మారుతీ సుజుకీ ప్లాన్

తమ విక్టోరిస్ మోడల్ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. విక్టోరిస్‌ను అక్రాస్ పేరుతో గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తామని చెప్పింది. 450 కార్ల తొలి బ్యాచ్‌ను తరలించామని వెల్లడించింది. 2025లో 3.9 లక్షల కార్లను ఎగుమతి చేశామని సంస్థ సీఈవో హిసాషి టకేయుచి తెలిపారు. విక్టోరిస్ ధర రూ.10.50 లక్షలు-రూ.19.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.
News January 17, 2026
ఇరాన్ నుంచి వెెనుదిరుగుతున్న భారతీయులు

అంతర్గత నిరసనలు, మరోపక్క USతో యుద్ధవాతావరణం నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ పౌరులు వెనక్కి వస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని అక్కడి ఇండియన్ ఎంబసీ ఇప్పటికే హెచ్చరించింది. ఆ దేశంలో 9000 మంది భారతీయులుండగా వీరిలో విద్యాభ్యాసం కోసం వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. కమర్షియల్ విమానాలు ప్రస్తుతం తిరుగుతున్నందున ఇరాన్ వీడి వెళ్లడం మంచిదని సూచించింది.
News January 17, 2026
యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

TG: రాష్ట్రంలో పలువురు IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్(నాన్ క్యాడర్)ను నియమించింది. మొన్నటి వరకు ఈవోగా ఉన్న వెంకట్రావు అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు. ఇక ఆసిఫాబాద్ కలెక్టర్‌గా కె.హరిత, ఫిషరీస్ డైరెక్టర్‌గా కె.నిఖిల, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేశ్ ధోత్రేను సర్కార్ బదిలీ చేసింది.


