News March 17, 2024
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభించింది: మోదీ
AP: ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ‘నిన్ననే లోక్సభ ఎన్నికల నగారా మోగింది. ఆ వెంటనే ఇవాళ ఏపీకి వచ్చాను. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లుగా భావిస్తున్నా. ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి రాబోతున్నాం. ఎన్డీఏకి 400 సీట్లు దాటాలి. ఇందుకోసం మీరంతా ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.
Similar News
News December 23, 2024
ఇక్కడ స్థిరపడ్డాక ఏపీకి ఎందుకెళ్తాం?: నాగవంశీ
టాలీవుడ్ APకి వెళ్తుందనే ప్రచారం అవాస్తవమని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. తాను డబ్బు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నానని, తనలా స్థిరపడిన వారు తిరిగి APలో ఏం చేస్తారని ప్రశ్నించారు. షూటింగుల్లో ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తమకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు కానీ తెల్లవారుజామున గం.4:30కి సినిమా పడితే చాలని మీడియాకు తెలిపారు. FDC ఛైర్మన్ దిల్ రాజుకు తమ విజ్ఞప్తులు అందిస్తామన్నారు.
News December 23, 2024
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్ల నియామకం భేష్: గుత్తా జ్వాలా
ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడంపై బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా హర్షం వ్యక్తం చేశారు. ‘సీఎం రేవంత్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా విప్లవాత్మక చర్యగా మారనుంది. ట్రాన్స్జెండర్ల నియామకంతో సమాజంలో వారికి అధికారిక గుర్తింపు లభించింది. ఈ చర్య మన తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిశీల మార్పునకు శ్రీకారం కానుంది’ అని పేర్కొన్నారు.
News December 23, 2024
రేపటి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన
AP: మాజీ CM జగన్ రేపటి నుంచి 4 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 24న బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకొని YSR ఘాట్ వద్ద నివాళులర్పించి పులివెందుల చేరుకుంటారు. 25న CSI చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. 26న పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27న ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్లో జరగనున్న ఓ వివాహానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.