News October 10, 2024
blinkit: 10 నిమిషాల్లోనే ఛాయ్, సమోసా డెలివరీ?

క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ blinkit మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైనట్టు తెలిసింది. 10 నిమిషాల్లోనే ఛాయ్, సమోసా, శాండ్విచ్ వంటి బేకరీ ఐటెమ్స్ డెలివరీకి ప్లాన్ చేస్తోంది. మొదట 2 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడతారని తెలిసినట్టు Livemint పేర్కొంది. పేరెంట్ కంపెనీ Zomato వ్యూహాలనే బ్లింకిట్ అమలు చేయనుంది. ప్రస్తుతం FMCG, బ్యూటీ, ఇతర ప్రొడక్టులను 10-20 నిమిషాల్లోపు డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 18, 2025
హనుమాన్ చాలీసా భావం – 13

సహస్ బదన్ తుమ్హారో యశగావై|
అసకహి శ్రీపతి కంఠ లగావై||
వేయి తలలు కలిగిన ఆదిశేషుడు కూడా ఆంజనేయుడి కీర్తిని గానం చేశాడు. శ్రీరాముడు ఆయనను ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. ఈ నిష్కళంక సేవ, సాటిలేని భక్తి చాలా గొప్పది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ప్రశంసించి ఆలింగనం చేసుకోవడం భగవంతుని దయ, ప్రేమ పొందడానికి భక్తే ఉత్తమ మార్గమని, శ్రేయస్కరమని హనుమంతుడు నిరూపించాడు. <<-se>>#HANUMANCHALISA<<>>

BREAKING: భారీ అగ్ని ప్రమాదం

TG: మహబూబ్నగర్లోని గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.