News December 31, 2024
డెలివరీ బాయ్ అవతారమెత్తిన బ్లింకిట్ ఫౌండర్

ప్రముఖ గ్రాసరీ డెలివరీ యాప్ ‘బ్లింకిట్’ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా న్యూఇయర్ విషెస్ చెప్తూ డెలివరీ బాయ్ అవతారమెత్తారు. గురుగ్రామ్‌లోని ఓ స్టోర్‌కు వచ్చిన ఆయన డెలివరీ బాయ్ డ్రెస్ ధరించి ఆర్డర్ పిక్ చేసుకున్నారు. అందరితో పోల్చితే కాస్త నెమ్మదిగా ఆర్డర్‌ను ప్యాక్ చేసినట్లు ఆయన Xలో పేర్కొన్నారు. డెలివరీ చేసేందుకు తనకెంత సమయం పడుతుందో చూద్దామంటూ చేసిన పోస్ట్ వైరలవుతోంది.
Similar News
News December 13, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,10,000కి చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.270 తగ్గి రూ.1,33,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.1,22,750కి చేరింది.
News December 13, 2025
జుట్టుకు బలాన్నిచ్చే విటమిన్లివే..!

ప్రస్తుతకాలంలో కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చాలామంది హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఈ విటమిన్లుండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. విటమిన్ బి7, విటమిన్ డి, ఐరన్, జింక్, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటు జీవనశైలి మార్పులు, వ్యాయామం, తగినంత నీరు తాగడం వంటివి చేస్తే పట్టులాంటి జుట్టు సొంతమవుతుందంటున్నారు.
News December 13, 2025
పసుపులో ఆకుమచ్చ తెగులు – నివారణ

ఆకుమచ్చ తెగులు సోకిన పసుపు ఆకులపై చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి గోధుమ మచ్చలుగా మారతాయి. తెగులు తీవ్రమైతే ఆకు మాడిపోతుంది. దుంపలు, కొమ్ములు, మొక్కల ఎదుగుదల లోపించి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. ఈ తెగులు కట్టడికి లీటరు నీటికి మాంకోజెట్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రాము లేదా ప్రోపికోనజోల్ 1mlను 0.5ml జిగురుతో కలిపి 15 రోజల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


