News March 24, 2024
ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన ‘ఓపెన్ హైమర్’ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల జియో సినిమాలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే స్ట్రీమింగ్ అవ్వగా.. తాజాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. జియో సబ్స్క్రిప్షన్ ఉన్న వారు సినిమాను ఉచితంగా చూడవచ్చు. అణు బాంబు సృష్టికర్త ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఏడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.
Similar News
News January 28, 2026
తెలంగాణ రెండో దేశీ విత్తన పండుగ

TG: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లిలోని ఎర్త్ సెంటర్లో ఫిబ్రవరి 6,7,8 తేదీల్లో తెలంగాణ రెండో దేశీ విత్తన పండుగను నిర్వహించనున్నారు. ‘భవిష్యత్ వ్యవసాయానికి దేశీ వంగడాల పరిరక్షణ అత్యంత ముఖ్యం’ అనే నినాదంతో కౌన్సెల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దేశీ విత్తన పరిరక్షకులు, రైతులు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
News January 28, 2026
‘మెగా’ ఇంటికి ట్విన్స్ రాక కోసం డేట్ ఫిక్స్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈనెల 31న కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సీమంతం సమయంలో ఇన్‌స్టా పోస్ట్‌తో తాను కవలలకు జన్మనివ్వబోతున్నట్లు ఉపాసన <<18084618>>హింట్<<>> ఇచ్చారు. కాగా 2023 జూన్‌లో వీరికి క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. వారసుడొస్తున్నాడంటూ ఫ్యాన్స్ Xలో సందడి చేస్తున్నారు.
News January 28, 2026
వెలుతురు లేకపోవడమే ప్రధాన సమస్య: రామ్మోహన్

మహారాష్ట్ర విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. వెలుతురు సమస్యే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ల్యాండింగ్ సమయంలో సరైన వెలుతురు లేదని ఆయన వివరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు. మరోవైపు కాసేపట్లో రామ్మోహన్ ఘటనాస్థలికి వెళ్లనున్నారు. MHలోని బారామతిలో ఈ ఉదయం ఫ్లైట్ క్రాషై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిచెందిన విషయం తెలిసిందే.


