News May 2, 2024
బ్లడ్ గ్రూప్: O+ వారే అధికం

ప్రపంచ జనాభా 800 కోట్లకు పైగా ఉండగా అందులో O+ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు 42 శాతంగా ఉన్నట్లు ఓ నివేదిక పేర్కొంది. తర్వాత A+:31%, B+:15%, AB+:5%, O-:3%, A-: 2.5%, B-:1%, AB-:0.5 శాతంగా ఉన్నట్లు వివరించింది. ఇక INRA రక్త వర్గం ప్రపంచంలో పది మంది కంటే తక్కువ వ్యక్తుల్లో ఉంటుందట. ఏ బ్లడ్ గ్రూపు వారికి రక్తం ఇవ్వచ్చు.. ఏ గ్రూపు వారి నుంచి రక్తం తీసుకోవచ్చో పై గ్యాలరీలో చూడొచ్చు.
Similar News
News April 2, 2026
చద్దాకు వెల్లువెత్తుతున్న మద్దతు!

రాజ్యసభలో పార్టీ డిప్యూటీ నేతగా <<19547250>>రాఘవ్ చద్దా<<>>ను ఆప్ తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. SMలో ఆయనకు మద్దతుగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల పక్షాన నిలబడిన MPకి ఇచ్చే గౌరవం ఇదా అని నిలదీస్తున్నారు. ఆయనకు అన్యాయం జరిగిందంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన తొలగింపునకు గల కారణాలను పార్టీ ఇప్పటి వరకు వెల్లడించలేదు. దీంతో చద్దాకు, పార్టీకి మధ్య ఏమైనా విభేదాలున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
News April 2, 2026
అంబ’s రివెంజ్.. తెలుగులో తొలి ఏఐ చిత్రం!

‘‘అంబ’s రివెంజ్’’ పేరుతో తెలుగులో తొలి ఏఐ చిత్రం రూపొందుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మహాభారతంలోని అంబ కథను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భీష్ముడిపై ఆమె పెంచుకున్న పగ, ప్రతీకారం వెనుక ఉన్న ఆవేదనను చూపించబోతున్నారు. ఈ సినిమాకు జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్ కాగా, శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మిస్తున్నారు.