News October 1, 2024

రక్తమోడిన రోడ్లు.. ఏడుగురి మృతి

image

TG: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఆదిలాబాద్(D) మేకలగండి వద్ద NH-44పై అర్ధరాత్రి డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడడంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సాయంత్రం సూర్యాపేట(D) సీతారామపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది.

Similar News

News October 1, 2024

కొనసాగుతున్న బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’

image

TG: హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన ‘రైతు హామీల సాధన దీక్ష’ కొనసాగుతోంది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు 24 గంటల దీక్ష చేస్తున్నారు. ‘అర్ధరాత్రి 2 దాటినా రైతు హామీల సాధన దీక్ష కొనసాగుతోంది. బీజేపీ ప్రతినిధులు దీక్షా శిబిరంలో సేద తీరుతున్నారు’ అని ఇందుకు సంబంధించిన ఫొటోలను టీ బీజేపీ Xలో పోస్ట్ చేసింది.

News October 1, 2024

వరద బాధితుల ఖాతాల్లో రూ.588కోట్లు జమ

image

AP: వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొత్తం ₹602కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ₹588కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు CMకి తెలిపారు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అయి లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, వివరాలు సరిగా లేకపోవడంతో కొందరి అకౌంట్లలో నగదు జమ కాలేదని, బ్యాంక్‌కు వెళ్లి KYC పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించామన్నారు.

News October 1, 2024

US వీసా కోసం వెయిట్ చేస్తున్నవారికి గుడ్‌న్యూస్

image

US వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నవారికి ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటీ గుడ్ న్యూస్ చెప్పారు. భారతీయుల కోసం అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్స్ కేటాయించినట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటికే 12 లక్షలకు పైగా ఇండియన్స్ US వెళ్లారు. అమెరికా గణాంకాల ప్రకారం.. 2023 అక్టోబరు నుంచి ఏడాది కాలంలో 6 లక్షల స్టూడెంట్ వీసాలను అమెరికా జారీ చేయగా వాటిలో ప్రతి నాలుగింటిలో ఒకటి భారత విద్యార్థిదే కావడం గమనార్హం.