News June 23, 2024
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ

AP: రాష్ట్రంలోని వైసీపీ జిల్లా కార్యాలయాలకు అధికారులు వరుసగా నోటీసులు ఇస్తున్నారు. తాజాగా కడప జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మాణం అక్రమం అంటూ నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేని భవనాన్ని ఎందుకు కూల్చకూడదో వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా నిన్న ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. విశాఖ పార్టీ ఆఫీస్‌కు కూడా నోటీసులు ఇచ్చారు.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
News November 26, 2025
వచ్చే ఏడాది చివరికి కిలో వెండి రూ.6 లక్షలు: కియోసాకి

బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో మరింతగా పెరుగుతాయని రచయిత, బిజినెస్‌మ్యాన్ రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 50 డాలర్లుగా ఉన్న ఔన్స్ వెండి ధరలు త్వరలోనే 7 డాలర్లకు పెరగవచ్చని, వచ్చే ఏడాది చివరికి 200 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రూ.1.55 లక్షలు ఉన్న కిలో వెండి ధర రూ.6.2 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉంది.
News November 26, 2025
వేరుశనగ పంటకు నీటిని ఏ సమయంలో అందించాలి?

వేరుశనగను విత్తే ముందు నేల తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. మొదటి తడిని మొలక వచ్చిన 20-25 రోజులకు ఇవ్వాలి. దీని వల్ల పైరు ఒకేసారి పూతకు వచ్చి, ఊడలు కూడా సరిగా ఏర్పడి దిగుబడి బాగుంటుంది. తర్వాత నేల లక్షణం, బంక మట్టి శాతాన్ని బట్టి 7-10 రోజులకు ఒక నీటి తడినివ్వాలి. చివరి తడిని పంట కోతకు 4-7 రోజుల మధ్య అందించాలి. దీని వల్ల మొక్కలు పీకడం సులభం. గింజలు నేలలో ఉండిపోవు.


