News October 5, 2024
కంపెనీల వెబ్‌సైట్లకూ బ్లూటిక్.. త్వరలో గూగుల్ కొత్త ఫీచర్

ఫేక్ వెబ్‌సైట్లను సులభంగా గుర్తించడం, అందులోని సమాచారం ఆధారంగా యూజర్లు మోసపోకుండా ఉండేందుకు గూగుల్ చర్యలు తీసుకుంటోంది. సోషల్ మీడియా అకౌంట్ల మాదిరిగానే కంపెనీల వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చే ఫీచర్‌పై పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ వెబ్‌సైట్ లింక్‌లకు బ్లూటిక్ ఇచ్చి పరీక్షించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Similar News
News July 5, 2025
ఇవాళ టీమ్ ఇండియాకు కీలకం

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్‌కు ఇవాళ(4వ రోజు) కీలకం కానుంది. తొలి టెస్టులో చేసిన తప్పులను రిపీట్ చేయకుండా ముఖ్యంగా నేటి మార్నింగ్ సెషన్‌లో వికెట్లు పడకుండా ఆడాలి. రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులకు ఒక వికెట్ కోల్పోగా క్రీజులో రాహుల్, నాయర్ ఉన్నారు. వీరు నిలదొక్కుకొని వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలి. ప్రస్తుతం 244 రన్స్ లీడ్‌లో ఉండగా దాన్ని భారీ స్థాయికి తీసుకెళ్లాలి.
News July 5, 2025
DANGER.. బ్లూటూత్ వాడుతున్నారా?

బ్లూటూత్ ఆధారంగా పనిచేసే స్పీకర్లు, బడ్స్, హెడ్ ఫోన్స్ వాడే వారిని ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ‘హ్యాకర్లు బ్లూటూత్ ద్వారా ఆడియో పరికరాలను నియంత్రణలోకి తీసుకునే అవకాశముంది. సంభాషణలపై నిఘా పెట్టి, కాల్‌ను హైజాక్ చేసే ఛాన్సుంది. పెద్ద బ్రాండ్లు వాడుతున్నా ప్రమాదమే. కాల్ డేటా, కాంటాక్టులను దోచేసే ప్రమాదముంది. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో బ్లూటూత్ వాడకుండా ఉండండి’ అని సూచించింది.
News July 5, 2025
ఒకట్రెండు రోజుల్లో KCR ప్రెస్‌మీట్!

TG: అనారోగ్యం నుంచి కోలుకున్న మాజీ సీఎం KCR నిన్న యశోద ఆసుపత్రిలోనే పలువురు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ జల హక్కులపై వాస్తవాలు బయటపెడతానని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఒకట్రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇవాళ ఉ.11 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.