News June 18, 2024

BNకండ్రిగ: గుండెపోటుతో టీచర్ మృతి

image

తిరుపతి జిల్లా BNకండ్రిగ మండలం సుగుపల్లి గ్రామానికి చెందిన తొడకాటి పురుషోత్తం గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. గణిత టీచర్‌గా ఎంతోమంది పిల్లలకు చదువు చెప్పారు. యోగా గురువు పోచినేని సురేష్ నాయుడు టీచర్ మృతిపై సంతాపం తెలిపారు.

Similar News

News January 28, 2025

చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. క్లీనర్ స్పాట్ డెడ్

image

చంద్రగిరి మండలం, మామండూరు జాతీయ రహదారిపై రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులో పార్కింగ్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి కోళ్లు లారీ ఢీకొట్టింది. దీంతో కోళ్లు లారీ క్లీనర్ వెంకటేశ్ క్యాబిన్‌లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు.‌ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కాలేజ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

News January 27, 2025

చిత్తూరు: ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోండి

image

చిత్తూరు నగరపాలక పరిధిలో సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి ఆసక్తిగల అభ్యర్థులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. రూ.2.50 లక్షలు బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణం అందిస్తామన్నారు. ఆసక్తిగలవారు వార్డ్ పరిధిలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు వార్డ్ అమినిటి కార్యదర్శిని కలవాలన్నారు.

News January 26, 2025

చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

image

చిత్తూరు నగరం మురుకంబట్టు సమీపంలో ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బిహార్‌కు చెందిన విద్యార్థిని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది. దీంతో ఆదివారం ఉరేసుకుని మృతి చెందిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.