News March 5, 2025

BNG: అంచనాల తారుమారుపై ఆలోచనలో యూటీఎఫ్!

image

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్ యూటీఎఫ్ ఓటమితో ఆ యూనియన్ ఆలోచనలో పడింది. 2019 ఎన్నికల్లో గెలుపొందిన తాము ఈసారి ఎందుకు ఓడిపోయామనే చర్చ యూటీఎఫ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రెండో స్థానానికి పడిపోవడంపై యూనియన్ ఆలోచనల్లో పడింది. గెలుస్తామని ధీమాతో ఉన్నా అంచనాలు ఎక్కడ తారుమారయ్యాయి.. ఓటమికి కారణాలేంటో విశ్లేషణ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Similar News

News December 6, 2025

VJA: ఇండిగో సమస్య.. హెల్ప్‌లైన్ నంబర్‌ల వివరాలివే.!

image

ఇండిగో విమాన ప్రయాణాలలో సమస్య తలెత్తడంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఇండిగో హెల్ప్‌లైన్ నంబర్‌లలో లేదా డ్యూటీ టెర్మినల్ మేనేజర్‌ను 9493192531 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు. ఈ నంబర్‌లలో ఇండిగో విమానాల తాజా సమాచారం లభిస్తుందన్నారు.

News December 6, 2025

మెదక్: చివరి రోజు 521 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో చివరి రోజు 521 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-54, కౌడిపల్లి-101, కుల్చారం-69, మాసాయిపేట-33, నర్సాపూర్-92, శివంపేట-106, వెల్దుర్తి-66 చొప్పున మూడు రోజులై కలిపి 1028 నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు మొత్తం 3528 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

News December 6, 2025

హనుమాన్ చాలీసా భావం – 30

image

సాధు సంత కే తుమ రఖవారే|
అసుర నికందన రామ దులారే||
ఆంజనేయుడు సాధువులకు, సత్పురుషులకు, మంచివారికి ఎప్పుడూ రక్షకుడిగా ఉంటాడు. ఆయన రాక్షసుల సమూహాన్ని నాశనం చేసి, లోకానికి శాంతిని కలిగిస్తాడు. శ్రీరాముడికి చాలా ప్రియమైనవాడు. ఈ గుణాల కారణంగానే హనుమంతుడు అపారమైన శక్తితో, భక్తితో ఈ ప్రపంచంలో అందరిచేత పూజలందుకుంటున్నాడు. <<-se>>#HANUMANCHALISA<<>>