News June 14, 2024
BNG: పదోన్నతుల ద్వారా HMల పోస్టుల భర్తీ
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 83 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అయ్యాయి. పదోన్నతులు ఉత్తర్వులు పొందిన 83 మందిలో 82 మంది గురువారం విధుల్లో చేరారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు విధుల్లో చేరలేదు. జిల్లాలోని 75 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి లభించగా ఇందులో 53 మంది ఎస్ఏలకు జిల్లా పరిధిలోనే పోస్టింగులు దక్కాయి.
Similar News
News September 21, 2024
మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌గా ఎంపికైన సిద్దిసముద్రంతండా వాసి
తిరుమలగిరి మండలం సిద్ది సముద్రం తండాకు చెందిన ధరావత్ సాయిప్రకాష్ శుక్రవారం ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని పంజాబ్ రాష్ట్రానికి ఎంపికయ్యాడు. సాయి ప్రకాష్ చిన్నతనం నుంచే చదువులో ముందు ఉండేవాడు. ఇంటర్ పూర్తికాగానే హైదరాబాద్లోని సివిల్స్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. దీంతో తండావాసులు సాయి ప్రకాష్ కు అభినందనలు తెలిపారు.
News September 21, 2024
NLG: కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు!
నూతన రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,07,259 రేషన్ కార్డులున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో వేలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే వారి కల నెరవేరబోతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News September 20, 2024
శ్రీశైలం జలాశయం సొరంగాన్ని సందర్శించిన మంత్రుల బృందం
శ్రీశైలం జలాశయం నుండి 40 కి.మీ భూగర్భ అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ దిగువన నిర్మించబడిన సొరంగాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి 30 టీఎంసీల నీటిని ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకొస్తుందని తెలిపారు.