News February 12, 2026
BNGR:మున్సిపల్ ఎన్నికలు అప్పుడు అలా.. ఇప్పుడిలా..!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. 2020లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే 2026లో 2 శాతం మేర తగ్గింది. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో మొత్తం 1,30,192 ఓటర్లు ఉండగా 1,13,398 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 87.1 శాతం పోలింగ్ నమోదయింది. ఓటింగ్ శాతం తగ్గాడానికి కారణాలు కామెంట్ చేయండి.
Similar News
News February 12, 2026
GDK: మహాశివరాత్రి సందర్భంగా వేలాలకు బస్సులు

ఈ నెల 15 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ నుంచి 14, 15, 16 వరకు వేలాల జాతరకు బస్సులను నడిపించనున్నట్లు డిపో మేనేజర్ నాగభూషణం గురువారం ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు 22 బస్సులు మూడు రోజులపాటు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయాలని సూచించారు. పెద్దలకు ₹ 80, పిల్లలకు ₹ 50 టికెట్ చార్జీలు నిర్ణయించామన్నారు.
News February 12, 2026
కృష్ణా: సర్కారీ బడి.. కార్పొరేట్‌కు సరైన జోడి!

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు PM శ్రీ పథకం కింద నిధులు కేటాయించారు. కృష్ణా (D)లో 27, NTRలో 29 పాఠశాలలను ఎంపిక చేసి, ఒక్కో దానికి ₹2-5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ లైబ్రరీలు, స్టెమ్ ల్యాబ్స్, క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తున్నారు. కొండపల్లి వంటి చోట్ల ఆర్ట్స్, క్రాఫ్ట్ శిక్షణతో విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.
News February 12, 2026
ఇంటర్ సెకండియర్లో NCERT ఆధారిత సిలబస్

AP: ఇంటర్ సెకండియర్లో 2026-27 నుంచి NCERT ఆధారిత సిలబస్‌ను అమలు చేస్తామని బోర్డు ప్రకటించింది. ‘సైన్సులో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ (బోటనీ, జువాలజీ కలిపి) ఉంటాయి. ఆర్ట్స్‌లో సివిక్స్, ఎకనమిక్స్, కామర్స్, హిస్టరీలుంటాయి. భాషల్లో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ ఉంటాయి’ అని బోర్డు తెలిపింది. ఫస్టియర్లోని సవరించని 5 సబ్జెక్టులను 2026-27 నుంచి సవరించి అమలు చేస్తామని పేర్కొంది.


