News June 25, 2024

BNGR: కుటుంబ కలహాలతో యువకుడు సూసైడ్

image

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామానికి చెందిన మహేష్ వ్యవసాయ కూలీల పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన మహేష్ తన వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొర్రెల కాపరులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Similar News

News October 19, 2025

NLG: ల్యాప్‌టాప్, నగదు మిస్సింగ్.. నిజాయితీ రూపంలో తిరిగొచ్చాయి

image

నల్గొండ నుంచి మిర్యాలగూడకు ప్రయాణిస్తున్న నెమ్మాని సంధ్య ఆటోలో తన ల్యాప్‌టాప్‌తో పాటు రూ.1500 నగదు మరిచిపోయారు. అయితే ఆటో డ్రైవర్ ఎండీ లతీఫ్ వాటిని నల్గొండ టూ టౌన్ పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఎస్సై వై. సైదులు విచారణ జరిపి ల్యాప్‌టాప్, నగదును సదరు మహిళకు అందజేశారు. లతీఫ్ నిజాయితీని ఎస్సై అభినందించారు. ఈ మంచితనం ఆదర్శనీయమని ఎస్సై పేర్కొన్నారు.

News October 18, 2025

న్యాయ అవగాహన పెంపులో పీఎల్‌వీల సేవ కీలకం: జడ్జి పురుషోత్తం రావు

image

సమాజంలో న్యాయ అవగాహన కల్పించడమే పారా లీగల్ వాలంటీర్ల(పీఎల్‌వీ) ప్రధాన లక్ష్యమని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తం రావు అన్నారు. పీఎల్‌వీల ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయం అందరికీ చేరేలా పీఎల్‌వీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరగబోయే జాతీయ కాన్ఫరెన్స్‌కు ఎంపికైన శ్రీకాంత్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

News October 18, 2025

NLG: టెండర్ల జాతర.. ఒక్క షాపుకే 100 దరఖాస్తులు !

image

ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఉదయం నుంచే ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లాలో 329 షాపులకు టెండర్లు స్వీకరిస్తున్నారు. అయితే నల్గొండ జిల్లా ధర్వేశిపురం వైన్స్ కోసం 100కు పైగా టెండర్లు దాఖలైనట్లు సమాచారం. నేడు బంద్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినప్పటికీ DDలు తీసి ఉంటే రాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.