News March 19, 2025
BNGR: కేటాయింపులు సానుకూలంగా ఉంటాయా..!

రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు రూ.200 కోట్ల పరిహారం రావాల్సి ఉంది. బునాదిగానికాల్వ, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, మూసీ కాలువల ఆధునికీకరణకు నిధులు కేటాయించాల్సి ఉంది. గందమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులపై ఆయకట్టు రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
Similar News
News October 29, 2025
రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం

“మొంథా” తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రైతుల పంట నష్టాలు నివారించేందుకు సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తుఫాన్ తగ్గే వరకు వరి కోతలు నిలిపివేయాలని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
News October 29, 2025
స్కానింగ్ కేంద్రాలు నిబంధనలు పాటించాలి: డీఎంహెచ్ఓ

సంగారెడ్డి జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు తప్పనిసరిగా పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం నిబంధనలను పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల బుధవారం తెలిపారు. ఆన్లైన్, హార్డ్ కాపీల రూపంలో వివరాలను కార్యాలయానికి పంపాలని ఆమె సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే, స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ లైసెన్స్ను రద్దు చేస్తామని డీఎంహెచ్ఓ హెచ్చరించారు.
News October 29, 2025
భీమడోలు: పంచాయతీ అధికారులకు DMHO ఆదేశం

భీమడోలు పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ అమృతం సందర్శించారు. తుపాను పునరావాసకేంద్రాన్ని పరిశీలించి అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి అందించే మంచినీటి సరఫరా వివరాలను గ్రామ కార్యదర్శి తనూజను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, శానిటేషన్ విషయంలో శ్రద్ధ వహించాలని పంచాయతీ అధికారులను DMHO ఆదేశించారు.


