News February 6, 2025
BNGR: చిక్కనంటున్న బాహుబలి దున్న.. డ్రోన్‌తో వేట
యాదాద్రి జిల్లాలో జనావాసాల మధ్య అడవి దున్న సంచరిస్తుండడంతో జిల్లా వాసులంతా భయపడుతున్నారు. ఇటీవల ఆత్మకూరు ఎం మండలం పల్లెల శివారులో కనిపించిన అడవి దున్న.. ఉదయం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు శివారులో ప్రత్యక్షమైంది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు దున్న కోసం డ్రోన్ సహాయంతో గాలిస్తున్నారు. అడవి దున్నను పట్టుకోవడంలో అటవీశాఖ అధికారులు కొంత విఫలమవుతున్నారని పలువురు మండిపడుతున్నారు.
Similar News
News February 6, 2025
సంగారెడ్డి: పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్
సంగారెడ్డి జిల్లాలో మీ సేవలో పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో, ఇరిగేషన్, రెవెన్యూ ల్యాండ్ సర్వే తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో మీ సేవ కేంద్రాల్లో పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
News February 6, 2025
చెత్తను వేరుగా అందించడంపై అవగాహన కల్పించాలి: బల్దియా కమిషనర్
తడి పొడి చెత్తను వేరుగా అందించడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయపడ్డారు. మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో నిర్వహిస్తున్న సిగ్రిగేషన్ కంపోస్ట్ యూనిట్లను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర వ్యాప్తంగా సమగ్ర శానిటేషన్ విధానాలను అవలంభించడానికి ప్రయోగాత్మకంగా 6, 49వ డివిజన్లను ఎంపిక చేసి, కంపోస్టు యూనిట్లు చేర్చడం ద్వారా ఎరువుగా మార్చడం చేయాలన్నారు.
News February 6, 2025
మెదక్: ఏడుపాయల ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష
ఏడుపాయల ఆలయం పార్కింగ్ నియంత్రణపై శాశ్వత పరిష్కారానికి పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏడుపాయల ఆలయం పార్కింగ్ నియంత్రణకు శాశ్వత పరిష్కారం, మహాశివరాత్రి పర్వదినం, జాతర నిర్వహణకు శాఖల వారీగా కార్యచరణ పై చర్చించారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.