News February 15, 2025
BNGR: ‘పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేయాలి’

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల జాబితాలను అన్ని ప్రభుత్వ కార్యాలయంలో నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని అదనపు కలెక్టర్ గంగాధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై జడ్పీ సీఈవో శోభారాణితో కలిసి ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 997 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News December 10, 2025
TU: ముగిసిన డిగ్రీ పరీక్షలు.. 11 మంది గైర్హాజరు

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో B.A/B.Com/B.SC/BBA/BCA 1, 3, 5 సెమిస్టర్ల రెగ్యులర్, 2, 4, 6 సెమిస్టర్ల బ్యాక్ లాగ్(2021-25) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్షా కేంద్రాల్లో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగాయని వెల్లడించారు. బుధవారం 11 పరీక్షా కేంద్రాల్లో 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
News December 10, 2025
TU: డిగ్రీ పరీక్షలకు 11 మంది గైర్హాజరు

టీయూ పరిధిలోని డిగ్రీ-సీబీసీఎస్- I, III ,V సెమిస్టర్ (రెగ్యులర్), II, IV, VI సెమిస్టర్ (2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్‌ల) బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఉమ్మడి NZB జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్లలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం 18వ రోజు మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 83 మంది విద్యార్థులకు 72 మంది హాజరయ్యారు. 11 మంది గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
News December 10, 2025
చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరమంటే?

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.


