News February 11, 2025
BNGR: యథాతథంగా భాగ్యనగర్ రైలు

భువనగిరి జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11రోజులు రద్దు కావలసిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233,17234) రైలును నేటి నుంచి ఈ నెల 15 వరకు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేడు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది. కాగా రైలు రద్దు ప్రకటనతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News November 22, 2025
వెహికల్ చెకింగ్‌లో ఈ పత్రాలు తప్పనిసరి!

పోలీసులు వాహనాల తనిఖీ సమయంలో ఏయే పత్రాలను చెక్ చేస్తారో చాలా మందికి తెలిసుండదు. చెకింగ్ సమయంలో మీ వద్ద డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్‌తో పాటు పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఉండేలా చూసుకోండి. కమర్షియల్ వాహనమైతే పైన పేర్కొన్న వాటితో పాటు పర్మిట్ & ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి. తెలుగు రాష్ట్రాల వాహనదారులు mParivahan లేదా DigiLocker యాప్‌లలో డిజిటల్ రూపంలో ఉన్న పత్రాలను చూపించవచ్చు. SHARE IT
News November 22, 2025
దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలి: KTR

TG: ఈనెల 29న ‘దీక్షా దివస్’ను ఘనంగా నిర్వహించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపునిచ్చారు. “15 ఏళ్ల క్రితం, పార్టీ అధినేత KCRగారు ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసుల్లోనే దీక్షా దివస్‌ను నిర్వహించుకోవాలి. కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా KCR భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలి” అని పార్టీ నేతలకు నిర్దేశం చేశారు.
News November 22, 2025
గ్రీన్ ఫీల్డ్ హైవే పరిహారంలో జాప్యం.. రైతుల్లో ఆందోళన

వరంగల్ జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పూర్తిగా అందకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సంగెం మండలం చింతలపల్లి, సంగెం, తిమ్మాపూర్, తీగరాజుపల్లిలో కలిపి వందల ఎకరాలు ప్రాజెక్ట్‌కు వెళ్లగా, మొత్తం 308 మందిలో 230 మందికే డబ్బులు జమయ్యాయి. నెక్కొండలో 440 మందిలో 386 మందికి, గీసుగొండలో ఆరుగురు, పర్వతగిరిలో ఐదుగురు కోర్టుకు వెళ్లడంతో వారి పరిహారం పెండింగ్‌లో ఉంది.


