News February 11, 2025
BNGR: యథాతథంగా భాగ్యనగర్ రైలు

భువనగిరి జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11రోజులు రద్దు కావలసిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233,17234) రైలును నేటి నుంచి ఈ నెల 15 వరకు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేడు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది. కాగా రైలు రద్దు ప్రకటనతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News March 27, 2025
UPI పేమెంట్స్ చేసేవారు ఇది తెలుసుకోండి!

నిన్న ఒక్కసారిగా UPI పేమెంట్స్ పనిచేయకపోవడంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఒక్కోసారి ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా లేకపోయినా UPI పేమెంట్స్ చేయలేం. అలాంటప్పుడు ఇలా చేయండి. తొలుత బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి *99# డయల్ చేస్తే మెనూ వస్తుంది. మనీ సెండింగ్, రిక్వెస్ట్ మనీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆప్షన్లలో కావాల్సింది ఎంచుకోండి. రిసీవర్ మొబైల్ నంబర్, UPI ఐడీ ఎంటర్ చేసి డబ్బు పంపించండి.
News March 27, 2025
పార్వతీపురంలో సాగునీటి వనరులపై సీఎం ఆరా

అమరావతిలో బుధవారం కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమీక్షలో పార్వతీపురం జిల్లాలోని సాగునీటి వనరులపై CM ఆరా తీశారు. ఉత్తరాంధ్రలోని ప్రధాన ప్రాజెక్టులైన తోటపల్లికిరూ.105 కోట్లు, తారకరామసాగర్‌కు రూ.807 కోట్లను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను సూచించారు. అలాగే సెంట్రల్ ట్రైబుల్ యునివర్సిటీకి రూ.29కోట్లు ఇస్తామన్నారు.
News March 27, 2025
WGL: ఈ వారంలో పత్తికి భారీ ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఈరోజు అన్నదాతలకు మళ్ళీ ఊరటనిచ్చాయి. ఈ వారం మొదటి నుంచి పోలిస్తే ఈరోజు పత్తి ధర అధికంగా పలికింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,030, మంగళవారం రూ.7,045, బుధవారం రూ.7,010 పలికిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ధర రూ.7050 కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.