News February 10, 2025

BNGR: రేపు ముసాయిదా జాబితా విడుదల

image

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భువనగిరి జిల్లాలో 17 ZPTCలు, 178 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

Similar News

News October 31, 2025

వర్డ్ ఆఫ్ ది ఇయర్ తెలుసా?

image

ఈ ఏడాదికి ‘67‌’ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రముఖ ఆన్‌లైన్ డిక్షనరీ వెబ్‌సైట్ డిక్షనరీ.కామ్ ప్రకటించింది. నంబర్‌ను పదంగా పేర్కొనడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి అర్థం లేదని, నిర్వచించలేమని వెబ్‌సైట్ స్పష్టం చేసింది. అమెరికన్ ర్యాపర్ స్క్రిల్లా డ్రిల్ <>సాంగ్<<>> ‘Doot Doot (6 7)’ నుంచి ఇది పుట్టిందని, టీనేజర్స్, జెన్ఆల్ఫా(2010-25 మధ్యలో పుట్టినవారు) దీనిని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. మీరూ ఉపయోగించారా?

News October 31, 2025

KNR: బాల్య వివాహాలపై 1098కు ఫిర్యాదు చేయండి

image

బాల్య వివాహాలు, బాలలపై జరుగుతున్న ఆగడాలపై ధైర్యంగా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన (DDU-GKY) కేంద్రంలో గురువారం యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ అందించే సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఈ సందర్భంగా వివరించారు.

News October 31, 2025

PHOTO OF THE DAY: దూరదర్శినితో DGP, CP

image

బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. డేటా సెంటర్, స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, సీపీ కార్యాలయం, హెలిప్యాడ్‌ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. CP సజ్జనార్‌తో కలిసి దూరదర్శిని సాయంతో నగరాన్ని వీక్షించారు. వీరి వెంట ICCC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉన్నారు.