News January 28, 2025
BNGR: సికింద్రాబాద్ నుంచి బస్సులు నడపాలని వినతి

సికింద్రాబాద్ నుంచి వయా బీబీనగర్, బట్టుగూడెం, పెద్ద రావులపల్లి, శివ రెడ్డిగూడెం, పోచంపల్లి వరకు బస్సు నడిపించాలని కోరుతూ మండలంలోని పెద్ద రావులపల్లి, శివరెడ్డిగూడెం గ్రామస్థులు అసిస్టెంట్ మేనేజర్ రోహిణికి వినతిపత్రం అందజేశారు. ఈ రూట్లో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ఉద్యోగులు, తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని తెలిపారు.
Similar News
News October 24, 2025
KMR: వైన్స్ దరఖాస్తుల గడువు ముగింపు..1502 దరఖాస్తులు

వైన్స్ షాపుల లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. కామారెడ్డి జిల్లాలోని 49 షాపుల వైన్స్ షాపులకు గాను 1502 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత్ రావు గురువారం Way2Newsకు తెలిపారు. అయితే, గత ఏడాది వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఈసారి సంఖ్య తగ్గింది. గతేడాది 2204 దరఖాస్తులు వచ్చాయి.
News October 24, 2025
ప్రభాస్ ‘స్పిరిట్’లో ఆ నటుడు లేనట్లేనా?

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో <<18087082>>స్పిరిట్<<>> మూవీ రానున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన సౌండ్ స్టోరీలో ప్రధాన పాత్రల్లో నటించే వారి వివరాలను వెల్లడించారు. ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ డాన్ లీ నటిస్తారని గతంలో ప్రచారం జరిగినా దీనిపై మూవీ యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజా అప్డేట్లోనూ ఆయన పేరు లేకపోవడంతో, ఎలాగైనా లీని ప్రాజెక్టులోకి తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
News October 24, 2025
కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

భారీ వర్షాల నేపధ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదన్నారు. ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం 8500292992కు కాల్ చేయాలన్నారు.