News March 19, 2025
BNGR: కేటాయింపులు సానుకూలంగా ఉంటాయా..!

రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు రూ.200 కోట్ల పరిహారం రావాల్సి ఉంది. బునాదిగానికాల్వ, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, మూసీ కాలువల ఆధునికీకరణకు నిధులు కేటాయించాల్సి ఉంది. గందమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులపై ఆయకట్టు రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
Similar News
News March 19, 2025
ఢిల్లీ వీధుల్లో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఇండియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వీధుల్లో అక్కడి పిల్లలతో క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. ఆయనతో పాటు కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ కూడా ఉన్నారు. ఇండియా, న్యూజిలాండ్‌ను ఏకం చేయడంలో క్రికెట్‌ను మించినది లేదని క్రిస్టోఫర్ ట్వీట్ చేశారు.
News March 19, 2025
ట్రాన్స్‌జెండర్ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అక్కడి నుంచి అనకాపల్లి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. కాగా ట్రాన్స్‌జెండర్‌ను చంపి ముక్కలుగా నరికి మూట కట్టి కశింకోట(M) బయ్యవరం వద్ద పడేసిన సంగతి తెలిసిందే.
News March 19, 2025
2025-26 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

TG: 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నల్లపోచమ్మ గుడిలో బడ్జెట్ ప్రతులను ఉంచి భట్టి ప్రత్యేక పూజలు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలి సారి. కాగా బడ్జెట్ రూ.3లక్షల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.