News January 7, 2026
BNGR: రుణమాఫీపై హైకోర్టును ఆశ్రయించిన రైతు

ప్రభుత్వ రుణమాఫీ అమలుపై వలిగొండ మండలం జంగారెడ్డిపల్లికి చెందిన నరసింహ రెడ్డి అనే రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరూర్ కెనరా బ్యాంకులో తాను తీసుకున్న రూ.1.50 లక్షల రుణం మాఫీ కాలేదని ఆయన పేర్కొన్నారు. రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం జీవో 567 జారీ చేసినప్పటికీ, తనకు ఆ ఫలాలు అందలేదని ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం తనకు న్యాయం చేయాలని ఆయన కోర్టును కోరారు.
Similar News
News January 8, 2026
మరో భారీ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న జమ్మలమడుగు

జమ్మలమడుగు.. ఇక్కడ రాజకీయ రణరంగమే కాదు, రాష్ట్ర, జాతీయ స్థాయి ఈవెంట్లను సైతం చేయగల సత్తా ఉన్న ప్రాంతం అని నిరూపిస్తోంది. ఈనెల 5 నుంచి ప్రారంభమైన 69వ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ పోటీలను సమర్థవంతంగా జమ్మలమడుగులోని అధికారులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఈ నెల 11 నుంచి 13 వరకు గండికోట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చివరిసారిగా 2020లో వైభంగా జరిగాయి. దీంతో అధికారులు ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్నారు.
News January 8, 2026
HURLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<
News January 8, 2026
విశాఖ తీరంలో మిస్సైల్ టెస్ట్!

AP: విశాఖ తీరం నుంచి మరోసారి మిస్సైల్ టెస్టుకు రక్షణ శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 12న అర్ధరాత్రి 12 నుంచి 13న 9AM వరకు నోటమ్(నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో తీరం వెంట 500 KM పరిధిలో విమాన రాకపోకలపై నిషేధం ఉంటుంది. కాగా డిసెంబర్ 24న కూడా ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే-4 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే.


