News January 23, 2025
BNGR: 23 యూనిట్లు మంజూరు: నరసింహారావు

దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు. 50వేల రూపాయలతో 100% రాయితీతో 23 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. 21 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన దివ్యాంగులు అర్హులని పేర్కొన్నారు. ఫిబ్రవరి రెండో తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News October 23, 2025
ఖమ్మం: మద్యం టెండర్లకు మంచి స్పందన

ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన లభించింది. గురువారం(నేటి)తో దరఖాస్తు గడువు ముగుస్తుండగా, వ్యాపారులు తీవ్రంగా పోటీ పడ్డారు. జిల్లాలోని 116 షాపులకు బుధవారం వరకు ఏకంగా 4,177 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజు కావడంతో దరఖాస్తులు మరింత భారీగా దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
News October 23, 2025
విశాఖలో నకిలీ కరెన్సీ గుట్టు రట్టు

విశాఖ ఎంవీపీ కాలనీలో పోలీస్ స్టేషన్ ఎదురుగా నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన శ్రీరాం గుప్తా, వరప్రసాద్ కలిసి ఒక రూమ్లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు దాడి చేశారు. ప్రింటర్స్, ఫోన్లు, కరెన్సీ తయారీ సామాగ్రి, లాప్టాప్, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
News October 23, 2025
KMM: ‘తక్కువ పెట్టుబడి-ఎక్కువ ఆదాయం’ అంటూ మోసం

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ ఖమ్మం నగరానికి చెందిన ఓ వైద్య విద్యార్థిని ప్రత్యూషను గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడు. మధురానగర్కు చెందిన ప్రత్యూషకు మొబైల్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి.. రూ.40 వేలు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. డబ్బు చెల్లించినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.