News August 23, 2024
BNSS 479 పెండింగ్ కేసులకూ వర్తిస్తుంది: కోర్టుతో కేంద్రం

CRPC 436Aను భర్తీచేసిన BNSS 479.. 2024, జులై 1కి ముందు నమోదైన కేసులకూ వర్తిస్తుందని కోర్టుకు కేంద్రం తెలిపింది. 2021 అక్టోబర్ నుంచి జైళ్లు కిక్కిరిసిపోవడంతో కోర్టు దీనిని సుమోటోగా తీసుకుంది. 479 ప్రకారం నేరానికి పడే శిక్షాకాలంలో మూడో వంతు అనుభవిస్తే తొలిసారి తప్పుచేసిన ఖైదీలకు ఉపశమనం కల్పించొచ్చు. దీంతో అండర్ ట్రయల్స్ దరఖాస్తులు క్లియర్ చేయాలని అన్ని జైళ్ల సూపరింటెండెంట్లను కోర్టు ఆదేశించింది.
Similar News
News December 1, 2025
గచ్చిబౌలి ఐటీ కారిడార్లో వాహనదారులు అవస్థలు

గచ్చిబౌలి ఐటీ కారిడార్లో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. మూడు లైన్ల రోడ్లు ఉన్నా సరే నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని దినాలు ఉండటంతో ఆ సమయాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్లోనే పోగొట్టుకుంటున్నామని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బాధ పడుతున్నారు. ఇటు కంపెనీలు, అటు ప్రభుత్వం దృష్టి సారిస్తే ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు.
News December 1, 2025
కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడనున్న ‘దిత్వా’

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News December 1, 2025
ఎయిమ్స్ రాజ్కోట్లో ఉద్యోగాలు

ఎయిమ్స్ రాజ్కోట్లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్సైట్: https://aiimsrajkot.edu.in/


