News April 3, 2024
ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు బోర్డు వార్నింగ్
TG: షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు తీసుకుంటే చర్యలు తప్పవని రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. పీఆర్వోలను పెట్టుకుని కొన్ని కాలేజీలు అడ్మిషన్లు చేయిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. ఇంకా జూనియర్ కాలేజీలకు 2024-25 విద్యాసంవత్సరం అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Similar News
News November 9, 2024
T20I: భారత్ తరఫున అత్యధిక సెంచరీలు
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(5) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్ (4), కేఎల్ రాహుల్ (2), సంజూ శాంసన్ (2) ఉన్నారు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలు చేసిన సంజూ ఈ జాబితాలో కేఎల్ సరసన చేరారు.
News November 9, 2024
నవంబర్ 9: చరిత్రలో ఈరోజు
* ప్రపంచ నాణ్యతా దినోత్సవం
* 1877: కవి మహమ్మద్ ఇక్బాల్ జననం
* 1895: ఆధునిక ఆంధ్ర కవి దువ్వూరి రామిరెడ్డి జననం
* 1924: రచయిత, కథకుడు కాళీపట్నం రామారావు జననం
* 1978: సినీనటుడు రాజా పుట్టినరోజు
* 2009: నోబెల్ గ్రహీత హరగోబింద్ ఖురానా మరణం(ఫొటోలో)
* 2005: మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మరణం
News November 9, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.