News April 11, 2024

ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు కీలక ప్రకటన

image

AP: రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించింది. జనరల్‌తో పాటు ఒకేషనల్ కోర్సుల రిజల్ట్ విడుదల చేస్తామంది. అటు అందరికంటే వేగంగా, సులభంగా WAY2NEWSలో ఇంటర్ ఫలితాలను చూసుకోండి.

Similar News

News November 15, 2024

తుఫాను వెళ్లే దారేది.. పసిగడుతున్న AI

image

వాతావ‌ర‌ణ పరిస్థితులపై ఇటీవ‌ల‌ సంప్రదాయ అంచనా విధానాలతో పోలిస్తే AI ఇస్తున్న కచ్చితమైన అంచ‌నాలు నిపుణుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. జులైలో బెరిల్ హరికేన్ ద‌క్షిణ మెక్సికో నుంచి ద‌క్షిణ టెక్సాస్‌ వైపు పయనిస్తుందని ఇతర విధానాల కంటే Google DeepMind’s GraphCast వారం ముందే ప‌సిగ‌ట్ట‌డం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. అయితే వీటికి ఫిజిక్స్ తెలియదని, సంప్రదాయ విధానాలతోపాటు వీటిని వాడుకోవచ్చంటున్నారు.

News November 15, 2024

IPL: రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌‌లో 81 మంది ఆటగాళ్లు

image

మెగా వేలంలో లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితాను IPL <>రిలీజ్ <<>>చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌‌లో 81 మంది, రూ.1.50 కోట్ల ప్రైస్‌‌లో 27, రూ.1.25 కోట్ల ప్రైస్‌‌లో 18, రూ.కోటి ప్రైస్‌‌లో 23, రూ.75 లక్షల కేటగిరీలో 92, రూ.50 లక్షల ప్రైస్‌‌లో 8, రూ.40 లక్షల ప్రైస్‌‌లో 5, రూ.30 లక్షల ప్రైస్‌‌ బేస్‌లో 320 మంది ఉన్నారు. 48 క్యాప్‌డ్, 193 మంది ఓవర్సీస్ క్యాప్‌డ్, 318 ఇండియన్ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు లిస్టులో ఉన్నారు.

News November 15, 2024

IPL ఆక్షనీర్‌గా మల్లికా సాగర్?

image

ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వాహకురాలిగా మరోసారి మల్లికా సాగర్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. 2023 వేలం కూడా ఆమెనే నిర్వహించారు. ఐపీఎల్ చరిత్రలోనే వేలం ప్రక్రియను పూర్తి చేసిన తొలి మహిళగా మల్లికకు రికార్డు ఉంది. గత వేలంలో ఆమె నిర్వహించిన ప్రత్యేక విధానానికి ప్రశంసలు రావడంతో మళ్లీ ఆమెనే ఎంపిక చేసినట్లు టాక్. కాగా WPL వేలం నిర్వాహకురాలిగా కూడా ఆమె వ్యవహరించారు. ఈ నెల 24న జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుంది.