News October 25, 2025

టోల్‌ప్లాజాల వద్ద పాస్‌ల వివరాలతో బోర్డులు: NHAI

image

వాహనదారుల్లో అవగాహన, పారదర్శకత కోసం NHAI కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల వద్ద నెలవారీ, వార్షిక పాస్‌ల వివరాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. 30 రోజుల్లోపు పాస్‌ల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పింది. ఈ మేరకు ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు, కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ఇతర ప్రాంతాల్లో ఇంగ్లిష్, హిందీ, స్థానిక భాషల్లో వివరాలను ప్రదర్శించనున్నారు.

Similar News

News February 13, 2026

సివిల్స్‌లో 2,834 ఉద్యోగ ఖాళీలు: జితేంద్ర సింగ్

image

దేశంలోని 3 సివిల్ సర్వీసెస్‌లో 2,834 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. 2025 జనవరి 1 నాటికి 1,300 ఐఏఎస్, 1,029 ఐఎఫ్ఎస్, 505 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ మూడు సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం 15,169 పోస్టులను అనుమతించగా 12,335 ఖాళీలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు.

News February 13, 2026

ఎన్నికల సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు: డీజీపీ

image

TG: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులపై దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని DGP శివధర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, కార్యకర్తలు.. ఇలా ఎవరైనా చట్టానికి అతీతులు కారన్నారు. సిబ్బంది పొరపాట్లు చేస్తే SECకి లేదా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటికే పోలీసులు, ఉద్యోగుల మీద చేసిన దౌర్జన్యాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని SPలను ఆదేశించారు.

News February 13, 2026

పాకిస్థాన్‌తో మ్యాచ్.. అభిషేక్ ఆడే ఛాన్సుందన్న వరుణ్

image

T20 WC: పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు అభిషేక్ శర్మ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిన్న మ్యాచ్ అనంతరం చెప్పారు. అభి బాగానే కనిపించాడని, ప్రాక్టీస్ కూడా చేశాడని తెలిపారు. మరోవైపు అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచులకు అందుబాటులో <<19122478>>ఉండకపోవచ్చని<<>> నిన్న మ్యాచుకు ముందు కెప్టెన్ సూర్య పేర్కొన్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. కాగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ తలపడనున్నాయి.