News October 3, 2024
పడవ ప్రమాదం.. 60కి చేరిన మృతులు

నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరింది. దాదాపు 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ నైజీర్ నదిలో మునిగిపోయింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 160 మందిని రక్షించారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. పడవ పాతదని, ఎక్కువ మందిని ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కాగా నైజర్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోందని, మృతులు పెరిగే అవకాశం ఉందన్నారు.
Similar News
News March 3, 2025
రేపు TDP కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నేతలతో చర్చించనున్నారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తమపక్కన తిరిగే వారికి కాకుండా పార్టీ కోసం పనిచేసే వారిని నామినేటెడ్ పదవులకు సూచించాలని MLAలను CM ఆదేశించిన విషయం తెలిసిందే.
News March 3, 2025
రోహిత్‌పై వ్యాఖ్యలా.. దేశం వదిలిపోండి: యువరాజ్ తండ్రి

రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన షామా మహమ్మద్‌పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మండిపడ్డారు. ‘దేశానికి గర్వకారణమైన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్లు సిగ్గుపడాలి. వారికి మన దేశంలో బతికే హక్కు లేదు. క్రికెట్ మా మతం. ఇలాంటి మాటల్ని సహించేది లేదు. నేనే ప్రధానమంత్రినైతే ఆమెను వెంటనే బ్యాగ్ సర్దుకుని దేశం విడిచిపొమ్మని ఆదేశించి ఉండేవాడిని’ అని పేర్కొన్నారు.
News March 3, 2025
కల్తీ నెయ్యి కేసు నిందితులకు మరోసారి కస్టడీ

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు పొమిల్ జైన్, అపూర్వ చావడాకు మరోసారి మూడు రోజుల పోలీస్ కస్టడీకి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. ఇటీవల ఈ కేసులో నలుగురు నిందితులను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే.