News September 13, 2025
కాంగోలో పడవ ప్రమాదాలు.. 193 మంది మృతి

కాంగోలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించారు. ఈక్వేటార్ ప్రావిన్స్‌కు 150 కి.మీ దూరంలో ఈ ప్రమాదాలు జరిగాయి. గురువారం సాయంత్రం 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 107 మంది మృతిచెందారు. 146 మంది గల్లంతు కాగా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం జరిగిన మరో ప్రమాదంలో మోటార్ పడవ బోల్తా పడి 86 మంది చనిపోయారు.
Similar News
News March 12, 2026
మార్చి 31లోపు ఇవి పూర్తి చేయండి!

ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తోంది. మార్చి 31లోపు సరైన ఇన్వెస్ట్‌మెంట్లతో పన్ను ఆదా చేసుకోండి. 80C కింద ELSS, PPFలలో ₹1.5 లక్షల వరకు, NPS (80CCD) ద్వారా అదనపు మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80Dలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియానికి ₹50 వేలు, 24(b) కింద హోమ్ లోన్ వడ్డీపై ₹2 లక్షల వరకు డిడక్షన్స్ క్లెయిమ్ చేయవచ్చు. అలాగే 80G కింద విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది.
News March 12, 2026
కాకినాడ ఆదిత్య యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో ECE, CSE, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. చివరితేదీ: మార్చి 15, వెబ్‌సైట్: <
News March 12, 2026
UPSCపై వివాదం.. ఇంటర్వ్యూలో పక్షపాతం?

UPSC సివిల్స్‌లో రిజర్వ్‌డ్ క్యాండిడేట్స్‌కు అన్యాయం జరుగుతోందంటూ SMలో చర్చ జరుగుతోంది. మెయిన్స్‌లో మంచి మార్కులు సాధించినా.. ఇంటర్వ్యూలో తక్కువ స్కోర్ వస్తున్నట్లు ఓ వర్గం ఆరోపిస్తోంది. ఇది ఇంటర్వ్యూ బోర్డు పక్షపాతం వల్లే అంటోంది. మెయిన్స్‌లో టాప్ మార్కులు వచ్చిన ఓ రిజర్వ్‌డ్ క్యాండిడేట్‌కు ఇంటర్వ్యూలో 60/275 మార్కులే వచ్చినట్లు ఉదహరిస్తోంది. దీన్ని మరో వర్గం మాత్రం కొట్టిపారేస్తోంది.


