News October 1, 2024

‘పడవలు, లడ్డూ, నటి’.. కాదేదీ రాజకీయానికి అతీతం: అంబటి

image

AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో విమర్శలు గుప్పించారు. ‘వరదలో పడవలు, లడ్డూ ప్రసాదం, ముంబై నటి.. కాదేదీ రాజకీయానికి అతీతం’ అని రాసుకొచ్చారు. వరదల్లో ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు కొట్టుకువచ్చిన పడవలు, శ్రీవారి లడ్డూ అంశం, నటి కాదంబరీ వ్యవహారాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. వీటితో కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు.

Similar News

News January 29, 2026

ఆటను ఆస్వాదించలేకపోయా.. రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్

image

తన రిటైర్మెంట్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆటను ఆస్వాదించలేకపోయా. మద్దతు, గౌరవం లభించలేదని భావించా. అలాంటప్పుడు ఎందుకు ఆడాలి, ఇంకా ఏం నిరూపించుకోవాలని అనిపించింది. మానసికంగా, శారీరకంగా ఇంతకుమించి చేయలేననే భావన ఏర్పడింది. ఇది చాలా బాధించింది. అందుకే రిటైరయ్యా’ అని సానియా మీర్జాతో ఇంటర్వ్యూలో అన్నారు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌‌కు యువీ వీడ్కోలు పలికారు.

News January 29, 2026

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>ఎయిర్‌పోర్ట్స్<<>> అథారిటీ ఆఫ్ ఇండియా 30 అసోసియేట్ కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు నేటి నుంచి FEB 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్ (సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, DV, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.70,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.aai.aero

News January 29, 2026

మరణించిన వ్యక్తి కలలో వచ్చారా?

image

మరణించిన వ్యక్తులు కలలో కనిపించడం అశుభం కాదు. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఇది మనసులోని బలమైన జ్ఞాపకాలకు, వారిపై ఉన్న ప్రేమకు ప్రతిబింబం. మృతులు కలలో కనిపించడం అంటే మీ జీవితంలో ఓ దశ ముగిసి, కొత్త మార్పులు మొదలవుతున్నాయని అర్థం. కొన్నిసార్లు వారు మనల్ని మార్గదర్శనం చేయడానికి కూడా రావచ్చు. మనసులో ఒత్తిడి, అసంపూర్తి కోరికల వల్ల కూడా ఇలాంటి కలలు వస్తాయి. ఆందోళన చెందక, మానసిక సంకేతంగా చూడటం మంచిది.