News February 28, 2026

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి గడువు పెంపు

image

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు అప్లై చేయడానికి మార్చి 15 వరకు గడువును పొడిగించారు. మేనేజర్, AVP ఫైనాన్స్& అకౌంట్స్, స్టేట్ హెడ్ రిటైల్ బ్రోకింగ్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు careers@bobcaps.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, PG/CA/MBA అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in

Similar News

News February 28, 2026

మహిళల్లో లంగ్ క్యాన్సర్‌ ముప్పు

image

మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రమాదకరంగా మారిందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. ఇండోర్‌, ఔట్‌డోర్‌ వాయు కాలుష్యం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం, చిన్న వయసులోనే మరణించే అవకాశం స్త్రీలలోనే అధికంగా ఉంది. బయో ఇంధనాలు, వంట నుంచి వచ్చే పొగకు ఎక్కువగా గురికావడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ ముప్పు పెరిగిపోతోందని, మహిళలు వాయుకాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది.

News February 28, 2026

‘6 గంటల నిద్ర’ సరిపోతుందా?

image

రాత్రిళ్లు తక్కువ సేపు నిద్రపోవడం ప్రమాదకరమే అంటున్నారు వైద్యులు. ‘రోజూ 6 గంటలే నిద్రపోతూ బానే ఉన్నాం అనుకోవడం భ్రమే. ఇలా 2 వారాల పాటు నిద్ర తగ్గిస్తే మెదడు రెండు రోజులు నిద్రలేని వ్యక్తిలాగే పనిచేస్తుంది. మన పనితీరు తగ్గుతున్నా మనకు తెలియదు. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతిని, నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరుగుతాయి. మెదడు ఆరోగ్యం కోసం రోజుకు 7-9 గంటల నిద్ర తప్పనిసరి’ అని సూచిస్తున్నారు. SHARE IT

News February 28, 2026

మాగుంట ప్రకటనతో కేజ్రీవాల్‌ను ఇరికించారు: జడ్జి

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తీర్పు సందర్భంగా జడ్జి జస్టిస్ జితేంద్ర సింగ్ అప్పటి YCP, ప్రస్తుత TDP MP మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును ప్రస్తావించారు. అప్రూవర్‌ మాగుంట ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్‌ను కేసులో 18వ నిందితుడిగా చేర్చారన్నారు. అప్రూవర్ మాటలతో కేసులో ఎలా ఇరికిస్తారని CBIని ప్రశ్నించారు. వారికి ప్రయోజనాలను చేకూర్చేందుకే కేజ్రీ మద్యం విధానాన్ని మార్చారని చెప్పేందుకు CBI ప్రయత్నించిందన్నారు.