News April 4, 2024

హోరాహోరీగా బొబ్బిలి సమరం

image

AP: చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లు విజయనగరం జిల్లా బొబ్బిలి. ఈ సెగ్మెంట్‌లో TDP చివరగా 1994లో గెలిచింది. దీంతో ఈ ఎన్నికల్లో నెగ్గి బొబ్బిలి గడ్డపై జెండా ఎగరేయాలని టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. బొబ్బిలి రాజవంశానికి చెందిన రంగారావు(బేబీనాయన)ని రంగంలోకి దింపింది. ఇటు 2014, 19లో వరుసగా గెలిచిన వైసీపీ అభ్యర్థి శంబంగి చినఅప్పలనాయుడు హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News October 7, 2024

‘దేవర-2’ షూటింగ్ అప్పటి నుంచేనా?

image

‘దేవర-2’ సినిమా షూటింగ్ 2025, అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు తెలిపాయి. పార్ట్-1కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పార్ట్-2కి పనిచేయకపోవచ్చని సమాచారం. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గత నెల 27న థియేటర్లలో విడుదలైన ‘దేవర’ ఇప్పటివరకు రూ.460కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. పార్ట్-1లో చాలా విషయాలను డైరెక్టర్ సస్పెన్స్‌లో పెట్టారు. దీంతో పార్ట్-2పై ఆసక్తి నెలకొంది.

News October 7, 2024

లెబనాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు.. 10 మంది మృతి

image

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 10 మంది మృతి చెందారు. బారాషీట్‌లోని అగ్నిమాపక కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. దాడి సమయంలో స్థానికంగా రెస్క్యూ మిషన్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్న 10 మంది పౌర రక్షణ సభ్యులు మరణించినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ చివర్లో ప్రారంభించిన ఇజ్రాయెల్ వరుస దాడుల్లో 1,400 మంది హెజ్బొల్లా సభ్యులు, పౌరులు మృతి చెందారు.

News October 7, 2024

కేంద్ర మంత్రులతో CM రేవంత్ భేటీ

image

ఢిల్లీలో ఉన్న CM రేవంత్ కేంద్ర మంత్రులు అమిత్ షా, మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌‌తో భేటీ అయ్యారు. మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌, మూసీ ప్రక్షాళన వంటి పనులకు సహాకారం అందించాలని కోరారు. CSMPని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయాలని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. HYDలో పురాత‌న మురుగుశుద్ధి వ్య‌వ‌స్థ‌ ఉంద‌ని, అది ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా లేద‌ని వివ‌రించారు.