News March 17, 2024
బొబ్బిలి: పురుగు మందు తాగి ఆత్మహత్య

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బొబ్బిలిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ఎస్.అనిల్ (30) కొన్నేళ్ల కిందట కొత్తపెంటలో బెల్లం ఆడించే పని కోసం తండ్రితో వచ్చాడు. పని పూర్తి కావడంతో ఇంటికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న ఆవుని అనిల్ అమ్మేశాడు. తక్కువ ధరకు అమ్మాడని తండ్రి కోప్పడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News January 22, 2026
VZM: ప్రభుత్వ సేవల్లో శతశాతం సానుకూల స్పందనే లక్ష్యం

ప్రభుత్వ సేవల్లో ప్రజల నుంచి శతశాతం సానుకూల స్పందన రావాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ సేవలు, ప్రజా స్పందనపై గురువారం చర్చించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. వసతిగృహాల్లో సేవలపై ప్రజా స్పందన తక్కువగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ వార్డెన్లకు మెమోలు జారీ చేయాలని సూచించారు.
News January 22, 2026
రూ.1300 కోట్లతో 4 ప్రాజెక్టుల పూర్తి: మంత్రి కొండపల్లి

పూర్వోదయ పథకం ద్వారా జిల్లాలో నాలుగు కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులను రూ.1300 కోట్లతో పూర్తి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. తోటపల్లి ద్వారా ప్రస్తుతం 58వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, మిగిలిన భూములకు కూడా నీరు అందేలా పనులు పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించిదన్నారు.
News January 22, 2026
బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదం: MLA కిమిడి

ఉపాధి హామీ పథకం విషయంలో బొత్స సత్యనారాయణ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని బొత్స చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రస్తుతం వేతనదారులకు డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని, ఆరోపణలు చేయడమే తప్ప జిల్లాకు మీ వల్ల జరిగిన మేలేమిటో చెప్పాలన్నారు.


