News July 25, 2024
‘దేవర’లో బాబీ డియోల్!

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ ఫ్రాంచైజీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారట. అయితే, పార్ట్-1లో తక్కువ సమయమే కనిపిస్తారని, పార్ట్-2లో మేజర్ రోల్ పోషిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేయనున్నారట. ‘యానిమల్’ మూవీలో డియోల్ రోల్కు అభిమానులు ఫిదా అయిన విషయం తెలిసిందే.
Similar News
News November 24, 2025
KMR: ఎన్నికల నగారా..సర్పంచ్, వార్డు రిజర్వేషన్లు ఖరారు

కామారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. BC డెడికేటెడ్ కమిషన్ పంపిన నివేదిక ఆధారంగా, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల శాతం మేరకు కసరత్తు పూర్తిచేసి దాదాపు ఖరారు చేశారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. జిల్లాలో మొత్తం 532 గ్రామ సర్పంచులు, 4,656 వార్డు మెంబర్ పదవులకు పోటీ జరగనుంది. జిల్లాలో మొత్తం 6,39,730 మంది ఓటర్లు ఉన్నారు. రిజర్వేషన్ల ఖరారుతో రాజకీయాలు వేడెక్కనున్నాయి.
News November 24, 2025
ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలపై అప్డేట్

APలో పంచాయతీ పాలక వర్గాలకు 2026 MAR వరకు గడువుండగా, MPTC, ZPTCల పదవీకాలం SEPతో ముగియనుంది. FEB, MARలో SSC, ఇంటర్ పరీక్షలు ఉండటంతో ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరగొచ్చు. పరిషత్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం SEP/OCTలో జరగొచ్చని అంచనా. కాగా రిజర్వేషన్ల ఖరారు కోసం వచ్చే నెలలో ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేయనుంది. అధ్యయనం, అభిప్రాయ సేకరణ అనంతరం కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారవుతాయి.
News November 24, 2025
ఇంట్లో శివలింగం ఉంటే.. ఈ నియమాలు తప్పనిసరి

ఎత్తైన శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠిస్తే కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు.
☛ లింగం నుంచి నిత్యం శక్తి విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి పైనుంచి చిన్న నీటి ప్రవాహమైనా ఉండాలి. ☛ రోజూ సాత్విక నైవేద్యం పెట్టాలి. ☛ ఇంట్లో మాంసాహారం వండకూడదు. ఇంట్లో వారెవరూ మద్యమాంసాలు ముట్టుకోకూడదు. ☛ ఓ ఇంట్లో 2 లింగాలను ప్రతిష్ఠించకూడదు. ☛ శివలింగం ఉన్న పూజా మందిరం పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలి.


