News July 19, 2024
‘భారతీయుడు 2’ నెగటివ్ రివ్యూలపై బాబీ సింహా ఆగ్రహం

కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదలైంది. సినిమాకు చాలా వరకు రివ్యూలు నెగటివ్‌గానే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ మూవీలో నటించిన బాబీ సింహా రివ్యూయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతి ఒక్కరూ వారే తెలివైనవాళ్లమనుకుంటారు. అన్నీ తమకే తెలుసనుకుంటారు. మేం బాగుందంటే మమ్మల్ని పిచ్చివాళ్లలా చూస్తారు. వారి అభిప్రాయాల గురించి చింతించాల్సిన పని లేదు’ అని తేల్చిచెప్పారు.
Similar News
News January 2, 2026
ఎలాన్ మస్క్.. విరాళాల్లోనూ శ్రీమంతుడే!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాను విరాళాల్లోనూ శ్రీమంతుడేనని నిరూపించారు. ఏకంగా 100 మిలియన్ డాలర్ల(సుమారు రూ.900 కోట్లు) విలువైన 2.10 లక్షల టెస్లా షేర్లను తన ఫౌండేషన్‌కు డొనేట్ చేశారు. 2024లో 112 మిలియన్ డాలర్లు, 2022లో 1.95 బిలియన్ డాలర్లు, 2021లో 5.74 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఛారిటీకి ఇచ్చారు. తాజా డొనేషన్ తర్వాత కూడా 619 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఆయన కొనసాగుతున్నారు.
News January 2, 2026
జనవరి 2: చరిత్రలో ఈరోజు

✒1954 : భారతరత్న పురస్కారం ప్రారంభం
✒1918: తెలంగాణకు చెందిన స్వాతంత్ర్య పోరాట యోధుడు బత్తిని మొగిలయ్య గౌడ్ జననం
✒1957: తెలుగు సినిమా హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (AVS) జననం (ఫొటోలో కుడివైపున)
✒1945: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు మరణం (ఫొటోలో ఎడమవైపున)
✒2015: భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత వసంత్ గోవారికర్ మరణం
News January 2, 2026
5 బిల్లులు.. MGNREGAపై స్వల్పకాలిక చర్చ

TG: అసెంబ్లీలో ఇవాళ చేపట్టే బిజినెస్ కార్యక్రమాలను కార్యదర్శి తిరుపతి ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆపై BAC రిపోర్ట్‌ను CM రేవంత్ ప్రవేశపెడతారు. మంత్రి ప్రభాకర్ రవాణా, BC వెల్ఫేర్ గెజిట్ నోటిఫికేషన్ పత్రాలు సభకు సమర్పిస్తారు. మున్సిపల్, GHMC ACT సవరణ, ప్రైవేటు వర్సిటీలు, మోటార్ వెహికల్ టాక్సేషన్ చట్ట సవరణ బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. MGNREGAపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.


