News February 13, 2025
ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్న

AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీలేదని తేల్చి చెప్పారు. బర్డ్‌ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం, శాస్త్రవేత్తలతో చర్చించామని, కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కి.మీ పరిధికే ఇది పరిమితం అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు.
Similar News
News November 28, 2025
రోజుకు 30-35 లీటర్ల పాలు.. ఈ ఆవులతో డెయిరీఫామ్ మేలు

ప్రపంచంలోనే అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతుల్లో హోలిస్టిన్ ఫ్రీజియన్ ఒకటి. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఒక ఈతలో 9వేల లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. ఇవి రోజుకు కనీసం 25-30 లీటర్లు, కొన్ని సందర్భాల్లో 35-40 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాలలో కొవ్వు 3.5%గా, ప్రొటీన్ 3.1%గా ఉంటుంది. ఈ రకం ఆవులతో డెయిరీఫామ్ నిర్వహణ మేలంటున్నారు వెటర్నరీ నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.
News November 28, 2025
అవసరమైతే కోర్టులో మూలన నిలబెట్టగలం.. రంగనాథ్‌పై HC తీవ్ర ఆగ్రహం

TG: అంబర్‌పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై HC ఆగ్రహించింది. న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా అని ప్రశ్నించింది. అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టులో ఓ మూలన నిలబెడతామని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బతుకమ్మ కుంట భూవివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.
News November 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 80

ఈరోజు ప్రశ్న: ఉప పాండవులను చంపింది ఎవరు? ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


