News December 30, 2024
అల్లు అర్జున్కు డబ్బింగ్ చెప్పేందుకు కష్టపడ్డా: బాలీవుడ్ నటుడు

‘పుష్ప-2’లో అల్లు అర్జున్ పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పేందుకు చాలా కష్టపడ్డట్లు బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే చెప్పారు. సినిమాలో AA ఎమోషన్స్, ఆటిట్యూడ్ను మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పాన్ తింటున్న, డ్రింక్ చేస్తున్న సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎగ్జైట్ అయినట్లు పేర్కొన్నారు. కాగా ఈ సినిమా హిందీలో రూ.700 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.
Similar News
News September 16, 2025
మరింత సులభంగా మూవీ షూటింగ్స్: దిల్ రాజు

TG: రాష్ట్రంలో సినీ రంగాభివృద్దికి కావాల్సిన అనుమతులన్నీ ఒకే విండో ద్వారా పొందేందుకు ప్రభుత్వం ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ అని ఓ వెబ్ సైట్ రూపొందిస్తోంది. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్తో వస్తే వారి మూవీకి కావాల్సిన లొకేషన్లు, అనుమతులు, టెక్నీషియన్లు, HYDతోపాటు రాష్ట్రంలోని హోటళ్లతో పాటు సంపూర్ణ సమాచారంతో ఈ వెబ్ సైట్ రూపొందిస్తున్నాం’ అని FDC చైర్మన్ దిల్ రాజు తెలిపారు.
News September 16, 2025
మళ్లీ భూముల వేలం.. ఎకరాకు రూ.101 కోట్లు

TG: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది. HYD ఐటీ కారిడార్ సమీపంలోని రాయదుర్గంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమికి అక్టోబర్ 6న ఈ-వేలం నిర్వహించనుంది. OCT 1 వరకు బిడ్ల దాఖలుకు అవకాశమిచ్చింది. రూ.2వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఎకరాకు కనీస ధరను ఏకంగా రూ.101 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
News September 16, 2025
డిసెంబరు కల్లా గుంతల రహిత రోడ్లు: కృష్ణబాబు

AP: రాష్ట్రంలో 19వేల కి.మీ. రోడ్లను రూ.860 కోట్లతో గుంతల రహితంగా మార్చినట్లు రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ‘ఈ డిసెంబరుకల్లా రహదారులను గుంతల రహితంగా మార్చాలన్నదే లక్ష్యం. మరో 5946 కి.మీ. రోడ్ల మరమ్మతులకు రూ.500 కోట్లు మంజూరు చేశాం. 8744 కి.మీ. జాతీయ రహదారులనూ బాగుచేశాం. PPP మోడ్లో 12,653 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయనున్నాం’ అని తెలిపారు.