News August 24, 2024
ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడి విమర్శలు.. నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!

స్టార్ హీరో ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ‘ఇక వెనక్కి వెళ్లకూడదు. నార్త్-సౌత్, బాలీVSటాలీ ఏం లేదు. యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే. అర్షద్ కాస్త మెరుగ్గా మాట్లాడి ఉంటే బాగుండేది. అయినప్పటికీ ఆయన పిల్లలకి బుజ్జి టాయ్స్ పంపిస్తున్నా. ప్రతి ఒక్కరినీ గెలిచేందుకు పార్ట్-2 కోసం కష్టపడి పనిచేస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 28, 2026
తాటి ముంజలు.. పోషకాల గనులు

వేసవిలో ఎక్కువగా లభించే తాటి ముంజల్లో విటమిన్ A, B, C, ఐరన్, జింక్, పొటాషియం లాంటి పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘వీటిని తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, ఎసిడిటీ, కాలేయ సమస్యలు తగ్గుతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడంలోనూ సాయపడతాయి’ అని పేర్కొంటున్నారు. తాటి ముంజలంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.
#ShareIt
News March 28, 2026
యుద్ధంలో ఇరాన్‌కు రోజుకు ₹1,319 కోట్ల ఆదాయం

ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభం ఇరాన్‌కు వరంగా మారింది. హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించిన ఆ దేశం ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ ద్వారా రోజుకు ₹1,319 కోట్ల ఆదాయాన్ని గడిస్తోంది. ఇతర గల్ఫ్ దేశాలు రవాణా చేయలేక సతమతమవుతుంటే ఇరాన్ మాత్రం రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తూ లాభపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, ఇరాన్ మౌలిక సదుపాయాలు సేఫ్‌గా ఉండటంతో ఆ దేశానికి ఆర్థికంగా కలిసొస్తోంది.
News March 28, 2026
చెన్నైకి బిగ్ షాక్.. 2 వారాలు ధోనీ దూరం

ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSKకు బిగ్ షాక్ తగిలింది. కండరాల గాయంతో బాధపడుతున్న మాజీ కెప్టెన్ ధోనీ మొదటి 2 వారాలు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది.


