News April 7, 2025
తెలంగాణ ప్రభుత్వంపై బాలీవుడ్ నటి ఫైర్

HYD కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బాలీవుడ్ నటి దియా మిర్జా తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ‘కంచ గచ్చిబౌలి పరిస్థితి గురించి తెలంగాణ సీఎం నిన్న ఒక ట్వీట్ చేశారు. నేను నకిలీ AI ఫొటోలు/ వీడియోలు ఉపయోగించానని చెప్పారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన. నేను పోస్ట్ చేసినవి ఒరిజినల్ వీడియోలు. ఇటువంటి వాదనలు చేసే ముందు మీడియా, ప్రభుత్వం వాస్తవాలను ధ్రువీకరించుకోవాలి’ అని ఆమె Xలో రాసుకొచ్చారు.
Similar News
News April 10, 2025
‘వక్ఫ్ బిల్లు’ పిటిషన్లపై 16న సుప్రీంలో విచారణ

వక్ఫ్ సవరణ బిల్లుపై ఈ నెల 16న సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని బెంచ్ వక్ఫ్ సవరణ బిల్లుపై దాఖలైన పిటిషన్‌లను విచారించనుంది. ఇటీవలే ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. అయితే ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి.
News April 10, 2025
IPL: గుజరాత్ ఘన విజయం

అహ్మదాబాద్‌లో జరుగుతున్న GTvsRR మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 159 పరుగులకే ఆలౌటైంది. శాంసన్-41(28బంతుల్లో), హెట్మెయిర్-52(32 బంతుల్లో) తప్ప బ్యాటర్లెవరూ ప్రతిఘటించలేదు. GT బౌలర్లలో ప్రసిద్ధ్ 3, రషీద్, సాయి కిశోర్ చెరో 2, సిరాజ్, అర్షద్, కుల్వంత్, తలో వికెట్ తీశారు.
News April 10, 2025
ENGకు ఆడటం కంటే ఏదీ ఎక్కువ కాదు: బ్రూక్

ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా ఎంపికైన హ్యారీ బ్రూక్ IPL వంటి ఫ్రాంచైజీ టోర్నీల్లో పాల్గొనకపోవడంపై స్పష్టతనిచ్చారు. ‘ENGకు ఆడటానికే నేను ప్రాధాన్యతనిస్తా. దీని కంటే ఏదీ ఎక్కువ కాదు. వేరే టోర్నీల్లో వచ్చే డబ్బును కోల్పోయినా ఫర్వాలేదు. దేశానికి ఆడటాన్నే నేను ఎక్కువగా ఎంజాయ్ చేస్తా’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ IPL సీజన్‌లో బ్రూక్ DCకి ఆడాల్సి ఉండగా టోర్నీకి ముందు తప్పుకొన్నారు.