News November 13, 2024

‘మిషన్ ఇంపాజిబుల్’లో బాలీవుడ్ బ్యూటీ?

image

బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌ని కలిశారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ సెట్లో ఆయనతో కలిసి ఫొటో దిగారు. క్రూజ్‌ను కలవడం కలలా ఉందని ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేయగా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దానిపై మిషన్ ఇంపాజిబుల్ ఇన్‌స్టా పేజీ కూడా స్పందించింది. కాగా అవనీత్ ఈ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది.

Similar News

News October 19, 2025

24 ఏళ్ల యువతితో 74 ఏళ్ల తాత పెళ్లి.. ₹2 కోట్ల ఎదురుకట్నం!

image

ఇండోనేషియాలో తన కన్నా 50 ఏళ్లు చిన్నదైన యువతి(24)ని పెళ్లాడాడో వృద్ధుడు (74). ఇందుకోసం ₹2 కోట్ల ఎదురుకట్నం చెల్లించాడు. తూర్పు జావాలో ఈ నెల 1న అరికాను టార్మాన్ పెళ్లి చేసుకున్నాడు. తొలుత ₹60 లక్షలు ఇస్తామని, తర్వాత ₹1.8 కోట్లు అందజేశాడు. అతిథులకు ₹6 వేల చొప్పున గిఫ్ట్‌గా ఇచ్చాడు. కానీ ఫొటోగ్రాఫర్‌కు డబ్బులివ్వకుండా ‘నవ దంపతులు’ అదృశ్యమయ్యారు. అయితే వారు హనీమూన్‌కు వెళ్లారని ఫ్యామిలీ చెబుతోంది.

News October 19, 2025

దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

image

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి, తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమివేసి, భక్తులను అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగ రోజున దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని మనం అనాదిగా పాటిస్తున్నాం. నేడు ఇలా దీపాలు వెలిగిస్తే అమ్మవారు మనపై అనుగ్రహం చూపి సంపదలు స్థిరంగా ఉండేలా చేస్తారని నమ్మకం. ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

News October 19, 2025

పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు శుభవార్త

image

AP: పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు దీపావళి సందర్భంగా శుభవార్త చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసి ఆయా సంస్థలకు చేయూత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను తొలి విడతగా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.