News March 3, 2025
తెలుగు సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా టాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. సుధీర్ బాబుకు జోడీగా ఆమె ‘జటాధర’ అనే సినిమాలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ మార్చి 8 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. గతేడాది తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడిన ఈ భామ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. చివరిసారిగా ఆమె పీరియాడిక్ డ్రామా ‘హీరామండి’, హారర్ కామెడీ ‘కాకుడ’లో కనిపించారు.
Similar News
News January 3, 2026
KCR అస్త్రాన్నే ఆయుధంగా మలుచుకుంటున్న రేవంత్!

TG: పాలమూరు ప్రాజెక్టు అస్త్రంగా GOVT, INCపై పోరాటం చేపట్టి ప్రజల్లోకి దూసుకెళ్లాలని BRS చీఫ్ KCR భావించారు. అందుకు తగ్గట్టు ఆ ప్రాంతంలో 3 సభలకూ నిర్ణయించారు. అయితే ఆ ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక అవినీతి జరిగిందని ఆరోపించిన CM దానిపై SIT ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. దీంతో KCR వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు ఆయన ప్రయోగించిన అస్త్రాన్నే రేవంత్ ఆయుధంగా మలుచుకున్నట్లవుతోంది.
News January 3, 2026
బినామీ ఆస్తుల గుర్తింపునకు AI టూల్: అతుల్ సింగ్

AP: అవినీతి కేసుల్లో రెవెన్యూ శాఖ అగ్రస్థానంలో ఉంది. 2025లో ACB 115 కేసులు నమోదు చేసింది. ఇందులోని 69 ట్రాప్ కేసుల్లో 19 రెవెన్యూ విభాగానివే. కాగా ఆదాయానికి మించిన కేసులు 8 ఉన్నాయి. విద్యుత్తు, వైద్య, మున్సిపల్, PR శాఖల ఉద్యోగులపై ఈ కేసులున్నాయి. ఉన్నత, మధ్యస్థాయి అధికారులు బినామీల పేరిట ఆస్తుల్ని కూడబెడుతున్నారు. వాటిని గుర్తించడానికి AI టూల్ను ప్రవేశపెడుతున్నామని ACB DG అతుల్ సింగ్ తెలిపారు.
News January 3, 2026
ఇతిహాసాలు క్విజ్ – 116 సమాధానం

ఈరోజు ప్రశ్న: వాల్మీకీ కన్నా ముందే రామాయణంలో ఒకరు రామాయణాన్ని రాశారు. అది ఎవరు?
సమాధానం: వాల్మీకీ కన్నా ముందు రామాయణాన్ని హనుమంతుడు రాశారని పురాణ గాథలు చెబుతున్నాయి. అది వాల్మీకి రచన కన్నా అద్భుతంగా ఉందని, తన రచనని ఎవరూ చదవరని వాల్మీకీ ఆందోళన చెందాడట. మహర్షి మనస్తాపాన్ని గమనించిన హనుమ, ఏమాత్రం ఆలోచించకుండా తను రాసిన రామాయణాన్ని రచనను చించివేశాడని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>


