News October 11, 2024
దీపావళి కానుకగా బాలీవుడ్ క్రేజీ మూవీ రిలీజ్

బాలీవుడ్‌లో మరో క్రేజీ సినిమా విడుదలకు సిద్ధమైంది. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన సింగం ఫ్రాంచైజ్‌లో వస్తున్న సింగం అగైన్ దీపావళి కానుకగా నవంబర్ 1న విడుదల కానుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో దీపిక, టైగర్ ష్రాఫ్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కూడా చుల్‌బుల్ పాండేగా క్యామియో చేసినట్టు టాక్.
Similar News
News April 2, 2026
ఇలాంటి కొడుకు బతికున్నా ప్రయోజనం లేదు!

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తల్లిదండ్రుల మీద దయ, ప్రేమలేని కుమారుడు పుట్టినా, చచ్చినా ఒక్కటే. ఎవరికీ ఉపయోగం ఉండదు. పుట్టలో చెదలు నిరంతరం పుడుతూ, చస్తూ ఉంటాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. తల్లిదండ్రులకు సేవ చేయని కొడుకు కూడా ఆ చెదలతో సమానమే. <<-se>>#PADHYAM<<>>
News April 2, 2026
సల్మాన్ – వంశీ పైడిపల్లి సినిమాలో అరవింద్ స్వామి?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లోని మూవీపై ఆసక్తికర అప్‌డేట్స్ వచ్చాయి. ఇందులో సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఓ పాజిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. ఓ పవర్‌ఫుల్ యాక్షన్ క్యామియోకు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్‌ను సంప్రదించినట్లు టాక్. ఇక విలన్ పాత్రకు ఓ టాప్ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని మూవీ టీమ్ భావిస్తోందట. ఇదే జరిగితే సినిమాపై అంచనాలు భారీగా పెరగనున్నాయి.
News April 2, 2026
రూపీ సూపర్ రికవరీ

ఇటీవల ఒక డాలరుకు ₹95.12కు చేరి ఆల్ టైమ్ <<19515449>>కనిష్ఠాన్ని<<>> నమోదు చేసిన రూపాయి విలువ క్రమంగా కోలుకుంటోంది. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో భారీ రికవరీ నమోదు చేసింది. ఒక డాలరుకు 93.48గా ఉన్న రూపాయి విలువ ఏకంగా 88 పైసలు పెరిగి 92.60కు చేరింది. యుద్ధం ఆగే సూచనలు, మార్కెట్లు నిన్న సానుకూలంగా ఉండటం రూపాయి రికవరీకి కలిసొచ్చింది.


