News July 13, 2024

బ్లాక్ బస్టర్ ‘కల్కి’పై బాలీవుడ్ డైరెక్టర్ ప్రశంసలు!

image

ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంపై బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ మేకర్స్‌ను అభినందించారు. కొందరు కావాలనే ‘కల్కి’పై నెగటివిటీ సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు కునాల్ స్పందించారు. ‘ఫేక్ PR, పెయిడ్ రివ్యూస్, ఇన్‌ప్లూయెన్సర్ ప్రమోషన్స్ లేకుండానే కల్కి బ్లాక్ బస్టర్‌ అయింది. ఈ విజయాన్ని సినీ పరిశ్రమ తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలి& నేర్చుకోవాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 20, 2025

బాబా రామ్‌దేవ్‌పై అరెస్ట్ వారెంట్

image

బాబా రామ్ దేవ్, పతంజలి MD ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో అరెస్ట్ చేయాలని ఆదేశించింది. మందులు, వ్యాధుల నివారణపై దివ్య ఫార్మసీ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నట్లు ఆ రాష్ట్రంలో పలు కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి కోర్టు ముందు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

News January 20, 2025

షూటింగ్ సెట్‌లో ప్రమాదం.. ఇద్దరు హీరోలకు గాయాలు

image

బాలీవుడ్ హీరోలు అర్జున్ కపూర్, జాకీ భగ్నానీ గాయపడ్డారు. ‘మేరే హస్బెండ్‌ కి బీవి’ మూవీ షూటింగ్ సందర్భంగా సెట్ పైకప్పు కూలింది. దీంతో వీరిద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు BN తివారీ అదృష్టవశాత్తు నటులకు తీవ్ర గాయాలు కాలేదని చెప్పారు. అయితే షూటింగ్‌ల సమయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News January 20, 2025

భారీ జీతంతో ఉద్యోగాలు

image

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL)లో 642 పోస్టులకు దరఖాస్తు గడువు FEB 16తో ముగియనుంది. ఇందులో జూ.మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులున్నాయి. టెన్త్, మూడేళ్ల డిప్లొమా చేసిన వారు అర్హులు. MTSకు 18-33ఏళ్లు, మిగతా పోస్టులకు 18-30Y వయసు ఉండాలి. జీతం MTSకు ₹16K-₹45K, జూ.మేనేజర్ ₹50K-₹1.60L, ఎగ్జిక్యూటివ్‌కు ₹30K-₹1.20L ఉంటుంది.
వెబ్‌సైట్: <>dfccil.com/<<>>