News March 15, 2025
పాక్‌లోని పంజాబ్‌లో బాలీవుడ్ పాటలపై బ్యాన్

బాలీవుడ్ పాటలపై పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గవర్నమెంట్ నిషేధం విధించింది. ఈ పాటలను పాడడం, వినడం, డాన్స్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రావిన్స్‌లోని అన్ని కాలేజీలు, విద్యాసంస్థల్లో ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొంది. దీనిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పాకిస్థాన్‌కు చెందిన ఎక్కువమంది యువత బాలీవుడ్ సాంగ్స్‌కు డాన్స్ చేస్తారనే విషయం తెలిసిందే.
Similar News
News March 16, 2025
ఇది జగన్మాత ఆదేశం: పవన్ కళ్యాణ్

AP: భారతదేశ ఔన్నత్యాన్ని తెలిపేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది ‘పరమశివుని’ కైలాసం. దక్షిణాది ఆయన కుమారుడు ‘మురుగన్’ నివాసం. వారు వెలిసిన ప్రదేశం ఈ ‘భారతదేశం’. ఇది జగన్మాత ఆదేశం’ అని పేర్కొన్నారు. ఉత్తర భారతానికి, దక్షిణాదికి తేడా లేదని చెప్పేందుకు పవన్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
News March 16, 2025
అతిగా నిద్ర పోతున్నారా?

కంటికి సరిపడా నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తే, అతి నిద్ర పలు రోగాలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 8-9 గంటల కంటే ఎక్కువగా పడుకుంటే షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఊబకాయానికి దారి తీయడంతో పాటు గుండెజబ్బులు వస్తాయి. డిప్రెషన్‌కు లోనై చిన్నచిన్న విషయాలకూ కోపం వస్తుంది. తల, వెన్నునొప్పి, కీళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. ఈ మార్పులు వెంటనే కనిపించకపోయినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తాయి.
News March 15, 2025
ముస్లింలకే 4% రిజర్వేషన్లు అని ఎవరు చెప్పారు?: DK శివకుమార్

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్లు ముస్లింలకే కేటాయించిందని కర్ణాటక సర్కారును ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ ఆ రాష్ట్ర Dy.CM డీకే శివ కుమార్ స్పందించారు. ‘కేవలం ముస్లింలకు 4% రిజర్వేషన్లు అని ఎవరు చెప్పారు. వెనకబడిన తరగతుల వారి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు అంటే ముస్లింలే కాదు. అందులో క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, సిక్కులు, మొదలైన వారు ఉంటారు’ అని క్లారిటీ ఇచ్చారు.