News April 28, 2024
ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

ముంబై ఎయిర్‌పోర్టు టెర్మినల్-1లో బాంబు ఉందంటూ వచ్చిన ఓ ఫోన్ కాల్, విమానాశ్రయ అధికారులను పరుగులు పెట్టించింది. టెర్మినల్ అంతా జల్లెడ పట్టి బాంబు లేదని నిర్ధారించుకున్న అనంతరం వారు ఊపిరి పీల్చుకున్నారు. అది ఆకతాయిల బెదిరింపు కాల్ కావొచ్చని తెలిపారు. ఓ ఉద్యోగినికి ఆ కాల్ వచ్చిందని వెల్లడించారు. బాంబు స్క్వాడ్‌తో తనిఖీల అనంతరం కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.
Similar News
News January 6, 2026
గ్యాస్ లీక్.. రూ.వందల కోట్ల నష్టం?

AP: అంబేడ్కర్ కోనసీమ(D) ఇరుసుమండలోని ONGC డ్రిల్ సైట్ నుంచి <<18770706>>లీకవుతున్న<<>> గ్యాస్‌ను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికీ 30 మీటర్ల మేర మంటలు ఎగిసిపడుతుండటంతో నిరంతరం నీటిని వెదజల్లుతున్నారు. బ్లోఅవుట్ ప్రాంతంలో 50 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. కాసేపట్లో ఢిల్లీ, ముంబై నుంచి స్పెషల్ టీమ్స్ చేరుకోనున్నాయి.
News January 6, 2026
ఫాల్కన్ MD అమర్దీప్ అరెస్ట్

ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి లభించింది. ఆ సంస్థ ఎండీ అమర్ దీప్‌ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను గల్ఫ్ నుంచి ముంబైకి రాగా ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. MNC కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో చేసిన రూ.850 కోట్ల స్కామ్‌లో అమర్దీప్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
News January 6, 2026
కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి కన్నుమూత

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి(81) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణేలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈయన రెండుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు క్యాబినెట్లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(1996-2012), ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్(2000-2013) అధ్యక్షుడిగానూ సేవలందించారు.


