News April 8, 2025
విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ముంబైకు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అప్పటికే ముంబై సమీపించిన విమానాన్ని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించారు. రాత్రి 8.50కి ల్యాండ్ అయిన విమానాన్ని వెంటనే దూరంగా తరలించి తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. విమానంలోని 225మందిని సురక్షితంగా కిందికి దించామని, ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని స్పష్టం చేశారు.
Similar News
News April 8, 2025
చిన్నారులపై లైంగికదాడులు.. నిందితుల అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులపై అత్యాచార ఘటనలు కలకలం రేపాయి. ఆదిలాబాద్‌లోని మావలలో 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. APలోని ఎన్టీఆర్ జిల్లాలో ఆరేళ్ల బాలికపై 43 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో చుట్టు పక్కన వాళ్లు అప్రమత్తమై నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
News April 8, 2025
రెండేళ్లలో 12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు

మరో రెండేళ్లలో 12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమైందని AICTE ఛైర్మన్ సీతారాం తెలిపారు. ఇంజినీరింగ్ డిప్లోమా, డిగ్రీ కోర్సుల మొదటి, రెండో సంవత్సరాల కోసం 600 పుస్తకాలు సిద్ధమైనట్లు తెలిపారు. 3, 4వ సంవత్సరాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ పుస్తకాలను అనువదించేందుకు ఏఐ సాంకేతికను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
News April 8, 2025
నేడు భారత్‌కు వస్తున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మఖ్తూమ్ రెండు రోజుల పర్యటన కోసం నేడు భారత్ వస్తున్నారు. రెండు దేశాల మధ్య ట్రేడ్, వ్యూహాత్మక సంబంధాలపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. యువరాజు హోదాలో ఇది ఆయన తొలి భారత పర్యటన. ఇటీవల అబుదాబి క్రౌన్ ప్రిన్స్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇండియాలో పర్యటించిన విషయం తెలిసిందే.